Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రితో ఫోన్ లో మాట్లాడిన నేపాల్ ప్రధాని శ్రీ కె.పి.శర్మ ఓలీ


నేపాల్ ప్రధాని శ్రీ కె.పి.శర్మ ఓలీ ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో టెలిఫోన్ లో మాట్లాడారు. నేపాల్ లో రాజకీయ పరిణామాలను గురించి ఆయనకు తెలియజేశారు. నేపాల్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ సమస్యలకు ఒక దీర్ఘకాలిక పరిష్కారాన్ని అన్వేషించడం పై శ్రద్ధ తీసుకోవాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా కోరారు. ఈ పరిష్కారం ఏకాభిప్రాయాన్ని సాధించినదై గాని, లేదా అందరి సమ్మతిని పొందినది గానీ అయి ఉండాలని శ్రీ మోదీ అభిలషించారు.

2016 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నేపాల్ ప్రజలందరికీ ప్రధాని శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.