పిఎంఇండియా
గుజరాతీ సంగీత జగతిలో ప్రముఖ సంగీతకారుడైన శ్రీ గౌరాంగ్ వ్యాస్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ గౌరాంగ్ వ్యాస్ తండ్రి అవినాశ్ వ్యాస్ సుసంపన్న సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతూ గుజరాతీ సంగీత రంగంలో తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సొంతం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఆయన మరణంతో గుజరాత్ ఒక ప్రతిభాశాలి సృజనశీలిని కోల్పోయిందని, గుజరాతీ సంగీత లోకానికి ఆయన అందించిన అమూల్యమైన తోడ్పాటును ప్రజలు సదా స్మరించుకొంటూనే ఉంటారని శ్రీ మోదీ అన్నారు.
ఈ లోకాన్ని వీడిన ఆత్మకు శాంతి కలగాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. శోకసంద్రంలో మునిగిన కుటుంబానికి, శ్రీ గౌరాంగ్ వ్యాస్ అసంఖ్యాక అభిమానులకు ప్రధానమంత్రి సంతాపాన్ని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో గుజరాతీ భాషలో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ ఈ కింది విధంగా పేర్కొన్నారు:
***
ગુજરાતી સંગીતજગતના જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના અવસાનથી અત્યંત દુઃખ થયું.
— Narendra Modi (@narendramodi) September 3, 2026
પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતે એક પ્રતિભાશાળી સર્જકને ગુમાવ્યાની લાગણી થાય છે. ગુજરાતી… pic.twitter.com/2Hb6PcRqqD