Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్.ఎస్. స్వామినాథన్ గురించిన రెండు భాగాల పుస్తకం ‘‘ద క్వెస్ట్ ఫార్ ఎ వరల్డ్ విదౌట్ హంగర్’’ ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్.ఎస్. స్వామినాథన్ గురించిన రెండు భాగాల పుస్తకం ‘‘ద క్వెస్ట్ ఫార్ ఎ వరల్డ్ విదౌట్ హంగర్’’ ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


గౌరవనీయులైన శ్రీ డాక్టర్ ఎమ్.ఎస్. స్వామినాథన్ గారు, నా మంత్రిమండలి సహచరుడు శ్రీమాన్ రాధా మోహన్ సింహ్ గారు, ఇంకా ఈ రోజు న ఇక్కడకు విచ్చేసిన మహానుభావులారా,

గుజరాత్ ముఖ్యమంత్రి పదవీబాధ్యతల ను నేను స్వీకరిస్తున్న వేళ, డాక్టర్ ఎమ్.ఎస్. స్వామినాథన్ గారి తో పరిచయ భాగ్యం నాకు లభించింది.  ఆయన యొక్క సమర్థన తో అప్పట్లో మేము నేల స్వస్థత కార్డు పథకాన్ని ప్రారంభించాము.  యాదృచ్ఛికం గా, ఈ ఆలోచన కు అప్పట్లో అధికారగణం నుండి ప్రబల ప్రతిఘటన ఎదురయింది.  ఏమైనా, చెన్నై లో డాక్టర్ ఎమ్.ఎస్. స్వామినాథన్ ఇచ్చిన సార్వత్రిక ఉపన్యాసాల లో ఒక ఉపన్యాసం ఈ పథకం యొక్క ప్రాధాన్యాన్ని సుప్రతిష్ఠితం చేసివేసింది; మరి అది నా సహచరులందరి మనస్తత్వాన్ని మార్చివేసింది కూడాను.  ఆ జన సభ లో ఆయన పూర్వపు గుజరాత్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేల స్వస్థత కార్డు పథకం యొక్క ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించారు.  అది ఒక  మహత్వపూర్ణమైన నిర్ణయమని, దాని తాలూకు ఘనమైనటువంటి లాభాలు భవిష్యత్తు కాలం లో చేజిక్కడం తథ్యం అంటూ ఆయన దాని ని ఆహ్వానించారు.  నేను చాలా కాలం గా నా సహచరుల ను ఒప్పించడం కోసం తంటాలు పడుతూ ఉంటే, డాక్టర్ స్వామినాథన్ ఇచ్చిన ఈ  ప్రకటన పత్రికల కు విడుదలయింది.  దాంతో నా సహచరులు అతి త్వరలోనే ఈ నా నిర్ణయం తో ఏకీభవించారు.  వారు ఇక ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యాన్ని నమ్మడం మొదలుపెట్టారు.  ఇదంతా డాక్టర్ స్వామినాథన్ యొక్క వచనబద్ధత ను, సమర్పణ భావాన్ని, శ్రద్ధ ను రుజువుచేస్తున్నది.  మరి నేనయితే వీటి ని స్వయం గా అనుభూతి చెందాను.  ఈ దూరాలోచన కలిగినటువంటి మరియు దేశవ్యాప్తం గా అమలు కానున్నటువంటి పథకం మొదలు కావడానికి నేను సాక్షి గా ఉండడం నాకు దక్కిన ఒక గౌరవం గా నేను భావిస్తాను. 

ఆయన ను ‘‘కృషి వైజ్ఞానికుడు’’ – ఓ వ్యవసాయ శాస్త్రవేత్త అంటూ అభివర్ణిస్తున్నప్పటికీ, నేను మాత్రం ఆయన సిసలైన ‘‘రైతు వైజ్ఞానికుడు’’ – ఓ రైతుల శాస్త్రవేత్త అనే నమ్ముతాను; ఆయన లో ఒక నిజమైన రైతు ఉన్నాడు.  ఆయన యొక్క వైజ్ఞానిక పరిశోధన లు ఒక ప్రయోగశాల పరిధి లో వ్యవసాయ ఉత్పత్తుల ను మరియు నాణ్యత ను అన్వేషించడమొక్కటే కాదు, కానీ అవి  భారతీయ వ్యవసాయ నేపథ్యం లో లోతు గా వేళ్లూనుకొని ఉన్నాయి కూడాను.  ఆయన రూపొందించిన వైజ్ఞానిక పత్రాలు రైతుల పై శ్రద్ధ వహించే అధ్యయనాల ను ఆవిష్కరిస్తాయి, ఇంకా ఈ కారణం గానే అవి చాలా సందర్భోచితం గా, ఆచరణాత్మకంగా మరియు ఉపయుక్తం గా ఉన్నాయి.   ఈ అన్వేషణ లు ప్రయోజనకారి అయినవి, మరి అందుకే వాటిని రైతులు వారి యొక్క పంటల నాణ్యత ను అధికం చేసుకోవడం కోసం ఆచరణలో పెట్టదగినవీనూ.  ఇదీ డాక్టర్ స్వామినాథన్ యొక్క ప్రత్యేకత మరియు ఔచిత్యం.

డాక్టర్ స్వామినాథన్ ఈ నాటి యువతీయువకుల కు ఎలాగ ప్రేరణ ను ఇవ్వగలుగుతారు?  విచిత్రం ఏమిటి అంటే, ఇవాళ్టి యువత కు వైజ్ఞానికుల కంటే కూడా రాజకీయ నాయకులను గురించే బాగా తెలుసును.  ప్రతి ఒక్క సందు లో కూడా రాజకీయ నేతల ను గుర్తుపట్టే వారు ఉంటారు తప్ప డాక్టర్ స్వామినాథన్ వంటి గొప్పవైన తోడ్పాటుల ను అందించిన వారు వెలుగు లోకి రావడం అనేది అరుదైనటువంటి విషయం.  దురదృష్టవశాత్తు, ఇది వ్యవస్థాగతమైనటువంటి దోషమో లేక స్వభావపరమైనటువంటి దోషమో అయి ఉంటుంది.  దీనికి భిన్నం గా, నేటి యువత వారి యొక్క ప్రేరణ ను క్రీడాకారుల లోనో, ప్రఖ్యాత కళాకారుల లోనో, రాజకీయ నేత లేదా ఓ వ్యాపార ప్రముఖుడి లోనో చూసుకొంటోంది కానీ ప్రఖ్యాత వైజ్ఞానికుల నుండి స్ఫూర్తి ని పొందాలని కోరుకోవడం లేదు.  ఆ కాలాన్ని గురించి ఒకసారి ఊహించుకోండి..  ఎప్పుడైతే భారతదేశం ఆకలి తో అలమటించిపోతూ, మరి ఒక దేశం గా నశించిపోతుందన్నది ప్రపంచం యొక్క అభిప్రాయం గా ఉండేది;  మరి ఇక్కడ ఒక యువ వైజ్ఞానికుడు ప్రపంచ విశ్వాసం తో తలపడి, ఆ దృష్టికోణాన్ని మార్చివేయాలని ప్రతిన బూనాడు.  అది హరిత విప్లవ పరిరక్షకుడు డాక్టర్ స్వామినాథన్ తప్ప మరి ఎవరో కాదు అన్న సంగతి ని ఈనాటి యువతీయువకులు ఎరుగరు. 

దేశం లోని ప్రస్తుత స్థితిగతులు స్టార్ట్- అప్ సంస్కృతి కి అత్యంత అనుకూలంగా ఉంటే, యువత కు పని చేయడానికంటూ అనేక సామర్థ్య రంగాలు ఉన్నాయి, మరి పోషకాహార లోపం అనేది వారు సమాధానాన్ని వెతకదగినటువంటి ఒక ఆందోళనకారకమైన సవాళ్ల లో ఒకటి గా ఉంది.  మన పప్పుధాన్యాలు మరియు నూనెగింజలు కూడా తక్కువ ఉత్పాదకత ను కలిగివున్నాయి; వారు మాంసకృత్తులు మెండు గా ఉండడం కోసం అనుసరించదగ్గ చర్యల ను కూడా సూచించవలసినటువంటి అవసరం ఉంది.  మన యువత పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించే సవాలు ను స్వీకరించి తీరాలి; అలాగే, వ్యవసాయ రంగ విప్లవాల లో పోషక విలువ లు లోపించిన ఆహారం తో పోరాడేందుకు సహకరించేటటువంటి నూతన ఆవిష్కరణల ను సైతం వారు తప్పక ముందుకు తీసుకు రావాలి.   మహాత్మ గాంధి అనే వారు- పేదల కు ఆహారమే వారి యొక్క దైవం- అని.  ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలిగే కోవ కు చెందిన నూతన ఆవిష్కరణల ను తీసుకు రావలసిన తరుణం ఆసన్నం అయింది. 

ఆయన యొక్క వ్యక్తిగత జీవనం లోని  కొన్ని అంశాలు నన్ను విశేషం గా ఆకట్టుకొన్నాయి.  మీరు ఇంతవరకు దాదాపు అందరు ప్రధానుల తో పనిచేశారని నేను ఎరుగుదును, అయినప్పటికి డాక్టర్ స్వామినాథన్ యొక్క వ్యక్తిత్వం లో ఎటువంటి అహంకారమూ ప్రతిబింబించడాన్ని ఎవ్వరూ ఎన్నడూ చూసి ఉండలేదు; ఆయన సీదాసాదాతనం మూర్తీభవించినట్లు అగుపిస్తారు.  ఈ మాటల ను నేను పుస్తకం ఆధారం గా చేసుకొని పలుకడం లేదు, ఆయన తో నాకు గల స్వీయ అనుభవాల నుండే ఈ మాటల ను ఆడుతున్నాను.  నేను గుజరాత్ లో ఉండగా, ఆయన నాతో ఎంతో నమ్రత తో నడుచుకొనే వారు.   మా యొక్క సంభాషణల ను ఎవరైనా గమనించినప్పుడు ఆయన ఒక మహా వైజ్ఞానికుడు అని ఎవ్వరూ ఎన్నటికీ గ్రహించే వారే కాదు.  ప్రజా జీవనం లో సఫలత తన ను అంటుకోకుండా మరియు సఫలత రావడం తో తాను చలనం లేకుండా ఉండడం అనేది ఒక గొప్ప గుణం.  ఈ సద్గుణం మనమంతా అనుకరించదగ్గది! ఒక వ్యక్తి గా ఆయన యొక్క వదనం ఎల్లప్పుడూ ప్రఫుల్లం గా ఉండేది.  ఆయన విచారం గా ఉండడాన్ని ఎవరైనా చూడడం కూడాను కుదరనిదే.  దురదృష్టవశాత్తు, ఇక్కడ కూర్చొన్న వైజ్ఞానికుల లో చాలా మంది (నన్ను క్షమించండి), చివరకు ఈ యొక్క 21వ శతాబ్దం లోనూ వారు ఇంకా 18వ శతాబ్దం లోనే ఉన్నట్లు గా జీవించాలని తలుస్తున్నారు.  వారు కోపం గా ఉన్నట్టు, ఇంకా  యావత్తు ప్రపంచపు బాధ్యత తాలూకు భారం అంతా వారి మీద పడ్డట్టు కనుపిస్తారు.   వారు ఎంతో కోల్పోయినట్టుగా కనపడతారంటే చివరకు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క అంతర్ముఖీన స్వభావాన్ని తలచుకొంటూ బెంగ పెట్టేసుకొంటున్నాయి.  దీనికి భిన్నం గా, డాక్టర్ స్వామినాథన్ లో అపారమైన సకారాత్మకత మరియు జీవితానందం తొణికిసలాడుతూ ఉంటాయి.  ఇది నిజం గా శ్లాఘనీయం.  ఇది ఒక్క గ్రాహ్య వివేకం తో మాత్రమే సాధ్యపడేది కాదు కానీ ఎప్పుడయితే ఎవరైనా జీవితం నుండి కూడా పాఠాల ను తమ లోపల కు ఇముడ్చుకొంటారో అప్పుడే దక్కేది.  ఆయన కు దైవీకమైనటువంటి కృప మరియు సంపన్నమైనటువంటి పారివారిక విలువ ల తాలూకు అండా దండా లభించాయి, కాబట్టే ఈ విధమైనటువంటి ప్రతిష్ఠ ను ఆయన దక్కించుకోగలిగారు అని నేను నిజం గా నమ్ముతున్నాను.

వ్యవసాయ రంగం లో, మన దేశం అనేక దశాబ్దులల తరబడి ఒకే విధమైనటువంటి సవాళ్ల ను నిరంతరం గా ఎదుర్కొంటూ వస్తున్నది.  మనం హరిత విప్లవం నుండి రెండో హరిత విప్లవానికి ముందంజ వేశామని మాట్లాడుకొంటున్నాము, కానీ పరిస్థితి నిరాశాజనకం గా మిగిలింది.  భారతదేశం వంటి ఒక దేశాని కి, లక్ష్యం ఏమిటయ్యా అంటే అది సతత హరిత విప్లవ ఆవిష్కరణ.  మనం మన అవకాశాల ను గురించి తెలుసుకొని, మరి వాటి పట్ల స్పష్టమైన అవగాహన ను ఏర్పరచుకోవలసిన సమయం వచ్చేసింది.  పశ్చిమ భారతం తో పోలిస్తే, ఈశాన్య భారత ప్రాంతాల లో ఆర్థిక అసమతూకం ఉండడాన్ని మనం గమనిస్తాము.   ఒకే దేశం లోని రెండు భాగాలు భిన్నమైనటువంటి ఆర్థిక వృద్ధి ని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఏ దేశం కూడా ప్రగతి ని సాధించజాలదు.  అటువంటి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పతనం అయి తీరుతుంది.  యావత్తు దేశాన్ని పటిష్టపరచడం కోసం ఒకటో వ్యవసాయిక విప్లవాని కి ప్రస్తుతం ప్రతిసృజన చేయడం ముఖ్యం; పశ్చిమ భారతం లో గోధుమ దీనికి నాయకత్వం వహించినట్లే, తూర్పు భారతం లో బియ్యాని కి సతత హరిత విప్లవానికి నేతృత్వం వహించేందుకు పూర్తి శక్యత ఉన్నది.   

నాలో ఓ నిశ్చితాభిప్రాయం ఉన్నది, అది ఏమిటి అంటే, మనకు జలం, సాగుయోగ్యమైనటువంటి భూమి, చెమటోడ్చి శ్రమించే రైతుల వంటి వనరు లు దండి గా ఉన్నాయి, కాబట్టి ఈ వనరుల కు వైజ్ఞానిక పద్ధతుల ద్వారా మరియు వైజ్ఞానిక ప్రమేయాల ద్వారా సమర్థన ను అందించడమే తక్షణ అవసరం అని.  ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం శక్తిలోపం లేకుండా పాటుపడుతున్నది, మరి డాక్టర్ స్వామినాథన్ మాకు నిరంతర మార్గదర్శి గా ఉంటూ వచ్చారు.   కొద్దికాలం క్రితం, నేను ఆయన తో భేటీ అయినప్పుడు, జట్టు కు మార్గదర్శి గా ఉండాలని అభ్యర్థించాను.  ఈ రోజు న ఉదయం ఆయన నా బృందం తో చాలా సేపు ఉండి ఈ అంశం పై కూలంకషం గా మథనం జరిపి, శ్రద్ధ వహించవలసినటువంటి కొన్ని రంగాలు ఏమిటి అన్నదానిపై సలహాల ను ఇచ్చారు.  జనాభా బాంబు చాలా వేగం గా పేలుడు స్థితి కి చేరువ అవుతున్న పూర్వరంగం లో, భూమి సంబంధి సంకటం ఆందోళనకరమైన స్థితి కి సమీపిస్తున్న కాలం లో, భూసార నిర్వహణ తాలూకు సత్వర చర్య లు అగ్ర ప్రాధాన్యాన్ని సంతరించుకొంటాయి.

వ్యవసాయ ఉత్పత్తుల రాశి ని మరియు వాసి ని ఎలా అధికం చేసుకోవాలనే కీలకమైనటువంటి అంశాల ను పరిష్కరించగలిగే ఒక సంపూర్ణ సమీప మార్గాన్ని చేరుకొనే దిశ గా శ్రమించడం ఎంతయినా ఆవశ్యకం.  చిన్న చిన్న భూమి భాగాల లో గరిష్ఠ ఉత్పత్తి కై చెమటోడ్చుతున్న సన్నకారు రైతులు దాదాపు గా 85 శాతం మంది ఉన్నారు, మరి ఆ కొద్దిపాటి నేల లు వారికి కనీస వినియోగాన్ని తీర్చుకోవడానికే ఉపయోగపడుతున్నాయి.  ఈ రైతులు అధిక నాణ్యత ను కలిగివుండే ఫలసాయాన్ని సాగు చేయగలిగేందుకు పూచీ పడే వ్యూహాల ను పరిచయం చేయవలసివుంది.  దాంతో పాటు వారి యొక్క వ్యక్తిగత అవసరాల ను నెరవేర్చుకోవడం తోనే సరిపెట్టకుండా వారి పంటల కు విపణి లో విలువ అధికం గా లభించగలిగే స్థితి కి సైతం చేరుకోవాలి. 

దేశం లో వ్యవసాయ అభివృద్ధి కి ఒక బెదరింపు ను రువ్వుతున్న మరియొక ప్రపంచ స్థాయి సవాలు ఏదయ్యా అంటే అది పెద్ద ఎత్తు న ఎదురుగా నిలచిన జల సంకటం.  ప్రాకృతిక వనరులు ఆందోళనకర స్థాయి లో తరిగిపోతుండడం వ్యవసాయాభివృద్ధి కి ఒక బెదరింపు వలె పరిణమించాయి.  నీటి పునర్వినియోగం, నీటి సంరక్షణ వంటి అనేక చర్యల ను చేపట్టడమైంది; ఏమైనప్పటికీ, ఈ సంక్షోభాన్ని మంటల ను ఆర్పివేసేటటువంటి  స్ఫూర్తి తో పరిష్కరించితీరవలసివుందన్న సంగతి నిర్లక్ష్యం వహించ తగనిది.  ఈ విషయాల లో మనం దూరదృష్టి ని కనబరచవలసిందే మరియు తత్ క్షణ చర్యల ను తీసుకొని తీరవలసిందే.  సమాజాన్ని జాగృతపరచడం అంటే అది అంత సులభం ఏమీ కాదు.  వాయు కాలుష్యం విషయానికి వస్తే పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా పొంచి ఉన్న సంకటాన్ని ముందుగానే నిరోధించలేకపోవడాన్ని మనం ఇప్పటికే గమనించలేదూ.  అదే మాదిరి గా, నీరు కూడా త్వరలో సరిపోని వనరు గా మారిపోగలదని సామాన్యుడు అర్థం చేసుకొనేటట్టు చేయడమనేది ఒక భారీ సవాలు కాగలదు.  నీటి ని పొదుపు చేసే మెలకువల కు తోడు, మనం జల వినియోగం తాలూకు శాస్త్రీయ పద్ధతుల ను కూడా కనుగొనవలసిన అవసరం ఎంతయినా ఉంది. 

వ్యవసాయ కార్యకలాపాల లో నీటి కొరత తాలూకు ప్రపంచ సమస్య కు ఎదురొడ్డి నిలవడం కోసం ప్రస్తుతం మేము ‘‘ప్రతి ఒక్క నీటి చుక్క కు మరింత అధిక పంట’’ వేదాంతాన్ని ప్రోత్సహిస్తున్నాము.  నదుల ను కలపాలనే ప్రచార ఉద్యమం తక్కువ ఖర్చు తో సేద్యం దిశ గా వేసినటువంటి ఒక అడుగు గా ఉన్నది.  ఇది సాగుబడి కి చాలినంత జలం లభ్యం అయ్యేటట్టు పూచీపడుతుంది.  ఎరువుల లో రసాయనాలు మరియు పురుగు మందుల వాడకాన్ని అడ్డుకోవడం ద్వారా భూమి నిర్వహణ దిశ గా సమర్ధవంతమైన చర్యల ను కూడా మనం తీసుకొని తీరాలి.  అవి నేల యొక్క నిర్మలత్వాన్ని నాశనం చేసి, మరి సాగుయోగ్యమైన భూమి ని పాడు చేస్తాయి.  నదీతీరాల వెంబడి వ్యవసాయ క్షేత్రాలు ఉన్న రైతులు చేసే నిరంతర ఫిర్యాదు ఏమిటి అంటే పరిశ్రమ ల నుండి వచ్చే కాలుష్యం వారి యొక్క పంటల ను నష్టపరుస్తోందన్నదే.  ఏమైనా, పొలాల లో రసాయనాల ను వాడితే వానలు వచ్చినపుడు వర్షం నీరు వ్యవసాయ క్షేత్రాల మీదుగా సాగిపోయి నది లోకి ప్రవహించేటప్పుడు అత్యంత అధిక ఆమ్లయుతమైన నీటి ని నదుల లో నింపివేస్తుంది మరి ఇది సేద్యాని కి హానికరం గా మారుతుంది అని వారు గ్రహించరు.  ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ ను ప్రారంభించడం యొక్క ధ్యేయం నదుల ను కాపాడి, మరి నదీజలాన్ని అభిలషణీయం గా వినియోగించుకొనేటట్టు చూడాలన్నదే.  ఇది నదుల రక్షణ పరిధి లో పరిశోధనల యొక్క మరియు నూతన ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యాన్ని ఇది ఎగదోసింది.

గ్రామాల లోని స్థానీయ గాథల ను పట్టించుకోవడం సహాయకారి గా రుజువు అవుతుంది ఎందుకంటే అవి తరచు గా సంస్కృతి తాలూకు తత్ క్షణ దర్శనం గా ఉంటాయి కాబట్టి.  నేను గుజరాత్ లోని భాల్ అనే పేరు తో పిలిచే క్షేత్రం తాలూకు నా యొక్క అనుభవాల లో ఒక అనుభవాన్ని గురించి వెల్లడించదలుస్తున్నాను.  అది ఖమ్భాత్ సింధు శాఖ ప్రాంతం లో సముద్రపు ఒడ్డు కు సమీపం లో ఉన్నది.  మా బాల్యం నుండి మేము భాలియా రకం గోధుమ ను గురించి వింటూ వచ్చాము. మరి అది ముఖ్యం గా ఎగువ తరగతి వారి ద్వారా వినియోగించబడేది అనీ, ఇంకా అది ఒక ఖరీదైన రకం అనీనూ.  ఈ కథ ను- అదే ఎగువ తరగతి వారు ఈ ప్రత్యేకమైనటువంటి గోధుమ రకాన్ని సేకరించి దాచిపెట్టేవారని – విన్నపుడల్లా నేను చకితుడిని అయ్యేవాడి ని.  గుజరాత్ కు నేను ముఖ్యమంత్రి ని అయినప్పుడు, ‘భాలియా’ గోధుమల వాసి విషయం లో మరింత గా తెలుసుకోవడం మొదలుపెట్టాను.  నా దృష్టి కి వచ్చిన సంగతి ఏమిటంటే చాలా వరకు గోధుమ రకాలు కర్బనం పాళ్ల ను ఎక్కువ గా కలిగివుంటే, ఈ భాలియా రకం గోధుమ మాత్రం మాంసకృత్తులు అధికం గా ఉంటాయని, మరి ఇది ఒక అరుదైన రకం అని.

స్విట్జర్ లండ్ ను ఒక సారి నేను సందర్శించిన సందర్భం లో, నెస్లే కు చెందిన కొందరి తో నేను భేటీ అయ్యాను.  మరి వారిని నేను కోరాను, పోషణ విజ్ఞానం సమస్య ను ఎలా పరిష్కరించాలో నాకు మార్గదర్శనం చేయవలసింది అని.  భాలియా రకంపై జన్యుసంబంధిత అధ్యయనాన్ని నిర్వహించాలి అని ఒక స్థానిక విశ్వవిద్యాలయానికి పురమాయించాను.  బాస్మతి రకం బియ్యం అధిక పోషక విలువలు మరియు నాణ్యత కు సమానార్థకం అయినట్లుగానే, ఇతర తృణధాన్యాలు మరియు గింజల లోని సమృద్ధియుత రకాల యొక్క బ్రాండ్ విలువ ను కూడా మనం కనుగొనవచ్చును.  సంపన్న వర్గాల కు చెందిన ఎవరైనా చిరుధాన్యాల ను కొనుగోలు చేయాలనే కోరిక ను  వ్యక్తం చేసినపుడల్లా నేను చాలా కుతూహలాన్ని వ్యక్తం చేసిన ఘటన ను నేను ఈ రోజు కు కూడా జ్ఞప్తి కి తెచ్చుకోగలను; వాటి లో గుజరాత్ లోని అమ్ రేలీ జిల్లా లో పండే రకం చిరుధాన్యాలు మాకు కావాలి అంటూ అనేకులు అడుగుతూ ఉండే వారు.  కాకతాళీయం గా, ఆ జిల్లా కు చెందిన శాసనసభ్యుడు నేను ముఖ్యమంత్రి గా పదవీప్రమాణం స్వీకరించినప్పుడు నాకు ఒక సంచీ నిండా వాటి ని బహుమానం గా ఇచ్చారు.  అప్పట్లో నాకు ఈ జిల్లా కు చెందిన చిరుధాన్యాల రకం యొక్క సమృద్ధతను గురించి తెలియదు.  నేను కొంత మంది వైజ్ఞానికుల ను సంప్రదించి దేశం లో అధిక దిగుబడి పంటల రకాల ను గురించి స్థానికులు చెప్పుకొనే అంశాల ను,  ఏయే కారణాల వల్ల ఆయా పంటలు అత్యంత లోకప్రియం అయ్యాయన్న విషయాల ను సేకరించమని సూచించాను.  అటువంటి రకాల ను గుర్తించడం మరి వాటి యొక్క జన్యు విలువ ను నిర్ధరించడం ఉపయుక్తం గా ఉండగలదు.

ఏదైనా ప్రాంతం దిగుబడి, అధిక ఫలసాయాన్ని ఇచ్చేటటువంటి మరియు అసాధారణమైన పోషక విలువలతో కూడినటువంటి రకానికి పేరు గాంచితే అటువంటి సాంప్రదాయక జ్ఞానాన్ని మనం వైజ్ఞానిక పరిశోధన తో మేళవించామా అంటే అప్పుడు అది చాలా మహత్వపూర్ణమైంది గా ఉంటుంది.  అవి అటు నాణ్యత పరంగా, ఇటు పోషకపదార్థాల పరంగా మానవాళి కి గొప్ప విలువైనవి గా తేలితే, అప్పుడు వెనువెంటనే తప్పక ఏదయినా పరిశోధన ను చేపట్టవచ్చును. 

దీనిని దృష్టి లో పెట్టుకొని, నేను నా విభాగానికి చెందిన మనుషుల కు వారు ప్రవేశించే జిల్లాల లోని పంటల రకాల పట్ల మరింత జాగరణ ను అలవరచుకొమ్మని ఆదేశించాను.  ప్రతి జిల్లా కు తనదైనటువంటి వ్యావసాయిక గుర్తింపు అంటూ ఉంది; అది ఆ జిల్లా లో పండేటటువంటి ఒక వరి రకం నుండి గాని లేదా సాబుదానా నుండి గాని లేదా జీలకర్ర నుండి గాని వచ్చిన గుర్తింపు కావచ్చు.  ఒక ఫలానా ఫలసాయం వారికి గుర్తింపు ను ఏ విధం గా ఇవ్వగలదనే విషయమై రైతుల లో మరియు ఆ గ్రామ నివాసుల లో జాగృతి ని కలిగించవలసిన అవసరం ఉంది.  

హిమాచల్ ప్రదేశ్ ను ఒక సారి నేను సందర్శించాను; అప్పట్లో శ్రీ ధూమల్ గారు ముఖ్యమంత్రి గా ఉన్నారు.  పుట్టగొడుగుల సాగు పెద్ద ఎత్తున జరుగుతున్న సోలన్ జిల్లా కు వెళ్లడం నాకు భలే రోమాంచం గా అనిపించింది.  నేను ఆ కాలం లో హిమాచల్ లోనే ఉండే వాడి ని.  ఆ రాష్ట్రం యొక్క బలాన్ని ఎవ్వరూ సరిగా వినియోగించుకోకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.  ఈ యొక్క వ్యావసాయిక గుర్తింపు ద్వారా బ్రాండ్ విలువ ను సంతరించేందుకు అక్కడ గొప్ప సామర్ధ్యమంటూ ఉండింది.  ఇవాళ సోలన్ లోకి ప్రవేశించేటపుడు ‘‘పుట్టగొడుగుల నగరానికి ఇదే స్వాగతం’’ అనే బోర్డు కనిపిస్తున్నది.  కివీ ఫలం మరియు యాపిల్ ఉత్పత్తుల గొప్పతనాన్ని చాటుతూ ఉండే బోర్డుల ను కూడా ప్రస్తుతం చూడగలుగుతాము.  ఆ జిల్లా రైతు లు పండించే పంట రకం కారణం గా జిల్లా యే కాక జిల్లా రైతులు కూడా విపణి లో పెద్ద పేరు ను తెచ్చుకొన్నారు.  వ్యాపారం లో అటువంటి గుర్తింపు నిజంగానే సహాయకారి గా ఉంటుంది.  పారిశ్రామిక క్లస్టర్ కోవలోనే, వ్యావసాయిక క్లస్టర్ లు కూడా రూపుదాల్చుతాయి.  అది జరిగేది ఎప్పుడంటే, ఒక బియ్యం రకానికి ప్రసిద్ధమైన జిల్లాలు 16 ఉంటే; అలాగే, మరో 20 జిల్లా లు వాటి యొక్క నూనె గింజల కారణం గా ప్రఖ్యాతి ని పొందినప్పుడు.  ఉత్పత్తి ని బాగా విక్రయించాలి అంటే అటువంటి భావనల ను అభివృద్ధిపరచవలసిన అవసరం ఎంతయినా ఉంది.  ఇది ప్రోసెసింగ్ తాలూకు వ్యాపారాని అవకాశాల ను తెరుస్తుంది; ప్రోసెసింగ్ తన వెంట విలువ జోడింపు ను తీసుకు వస్తుంది.  ఒక నిర్దిష్ట రకానికి చెందిన పండు కు విశిష్టమైనటువంటి ప్యాకేజింగ్ లేదా ఒక నూతనమైన బియ్యం రకానికి నిలవ ఏర్పాటుల ను పున:రూపకల్పన అవసరపడుతున్న కారణం గా, సరఫరా శృంఖలం నిర్వహణ విభాగం ప్రయోజనాన్ని పొందుతుంది.  ఒక ఉత్పత్తి కి ఎంతగా ప్రత్యేకత ను సంతరించామా అంటే, దాని యొక్క ప్యాకేజింగ్ గాని రవాణా గాని అంతలా రివాజు గా మారిపోతుంది.  దీనిని మనం మన దేశం యొక్క డిఎన్ఎ లోకి ఎంత త్వరగా ప్రవేశపెట్టగలుగుతామో 2022 వ సంవత్సరం లో మన స్వాతంత్ర్య సిద్ధి కి 75 వ సంవత్సరం వచ్చేసరికల్లా రైతులల కు ‘రెట్టింపు ఆదాయా’న్ని సాధించిపెట్టాలన్న మన లక్ష్యానికి మనం అంతగా చేరువ అవుతాము. 

కొద్ది కాలం కిందట డాక్టర్ స్వామినాథన్ తో నేను భేటీ అయినప్పుడు, 2022 వ సంవత్సరానికల్లా ‘రెట్టింపు ఆదాయం’ అనే విషయం పై చర్చించడం కోసం ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్తల తో నన్ను మాట్లాడించండి అని అభ్యర్థించాను.  దానికి ఆయన నాకో పత్రాన్ని అందించారు. అందులో సత్వరం తీసుకోవలసినటువంటి చర్యలు వ్రాసి ఉన్నాయి.  ఆ పనుల ను చేయాలని నేను యత్నిస్తున్నాను.  మనం లక్ష్యం పై గురి పెట్టి మరీ మూడు విషయాల పైన కసరత్తు చేయవలసివున్నది.  అవి తక్కువ ఖర్చు, అధిక ఉత్పాదకత, ఇంకా విలువ ను జోడించడం.  మనకు అందరికి తెలిసిన విషయమే, వేప పూత పూసిన యూరియా అనేది మిన్ను నుండి విరిగిపడిందేమీ కాదు.  దానికి అంతకు ముందెన్నడూ ప్రాముఖ్యాన్ని ఇవ్వనేలేదు.  ఏమైనా ప్రస్తుతం, అది చౌర్యాన్ని, ఇంకా అవినీతిని అరికట్టడం లో ఏ విధం గా సహాయకారి అయిందీ గమనించడం జరిగింది.  నిజానికి, యూరియా వినియోగం లో భారీ క్షీణత చోటు చేసుకొన్న తరువాత కూడాను బియ్యం, ఇంకా గోధుమ ల ఉత్పత్తి తగినంత గా పెరిగిందన్న విషయం వెలుగు లోకి వచ్చింది.  ఆయా ప్రాంతాల లో సర్వోత్తమమైన అభ్యాసాల ను ప్రజాదరణ పాత్రం అయ్యేటట్టు చేసే సరళమైన మార్గాలు ఇలాగే ఉంటాయి.  వాటి వల్ల దీర్ఘకాలిక  ప్రయోజనమూ చేకూరుతుంది.

భారత ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ ను మరియు ఆయన యొక్క వైజ్ఞానిక పరిశోధకుల సముదాయానికి ప్రతి ఒక్క అంచె లో సమర్ధన ను ఇచ్చేందుకు చొరవ తీసుకొంటోంది.  మనం సతత హరిత విప్లవం దిశ గా ముందుకు పోతున్నాము.  దేశం లో స్థిర వ్యవసాయ వ్యవస్థ ను పున:స్థాపించడం కోసం సకల ప్రయత్నాల ను చేస్తున్నాము.  మన ప్రధాన సవాళ్ల లో ఒకటి గా నిలచిన ప్రయోగాల ను మరియు సాంకేతిక విజ్ఞానపరమైనటువంటి ముందంజలను ప్రోత్సహించడం ద్వారా  ఆ దిశ గా సరి అయిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.  ‘‘ప్రయోగశాల నుండి నేల కు’’ అనేది మన లక్ష్యం అవ్వాలి.  వైజ్ఞానికులు వారి యావత్తు జీవితాల ను మన కోసం ఏదో ఒకటి అభివృద్ధిపరచడం కోసమే వారి యావత్తు జీవితాన్ని సమర్పణం చేస్తారు కానీ ఈ అంశాలు వ్యవసాయక్షేత్రాల లో ఎన్నటికీ అమలు లోకి రాకపోతూ ఉండడమే దు:ఖదాయకం.  వ్యాపారులకు మల్లే నష్టభయాని కి సిద్ధం గా రైతులు లేని కారణం గా ఇది ఆందోళన ను రేకెత్తించే అంశమై కూర్చుంది.  నూతనం గా కనుగొన్న అంశాల ను వారి యొక్క సేద్య అభ్యాసాల లో స్వీకరించేటట్టు గా వారి ని ప్రోత్సహించడం కోసమని, మేము ‘ప్రధాన మంత్రి  ఫసల్ బీమా యోజన’ ను ప్రవేశపెట్టాము.  ఇది రైతు లోకం లో బోలెడంత విశ్వాసాని కి తావు ను ఇచ్చింది.  ప్రస్తుతం ఈ పథకం తాలూకు రక్షణ ను పొందుతున్న రైతులు ఇదివరకటి పథకం తో పోలిస్తే ఏడింతలు అధికం గా ఉన్నారు.  క్రొత్త గా ఒక పథకం వచ్చిందీ అంటే ప్రాథమికం గా చైతన్యం కొరవడడం వల్ల ఎన్నో ‘అలా అయితే’ లు, ఇంకా ‘కానీ’ లు తలల ను ఎత్తుతాయి.  ఏమైనా, ఈ పథకం ప్రారంభం అయిన సంవత్సర కాలం లోనే దీని యొక్క స్వీకారం లో ఏడు రెట్ల పెరుగుదల నమోదు కావడం నిజంగా నే మెచ్చదగింది.  ఇది మన రైతు లు మరింత సురక్షితం గా ఉన్నట్లు భావిస్తున్నారని సూచిస్తున్నది.  భద్రత భావన వారి లో నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని తప్పక పెంపు చేయనుంది.  వారు వైజ్ఞానిక ప్రయోగాల పట్ల సుముఖం గా ఉన్నారు, ఇంకా సాగు లో సరిక్రొత్త ప్రమేయాల ను అమలుపరచేందుకు ఉత్సాహులు అయి ఉన్నారు కూడా.   ‘‘ప్రయోగశాల నుండి నేల కు’ ప్రక్రియ ను బలోపేతం చేయడం లో ‘ప్రధాన మంత్రి  ఫసల్ బీమా యోజన’ ఒక బలమైన ఉత్ప్రేరకం గా ఉంటున్నది. 

దేశాని కి, మరి రైతుల కు సేవ చేస్తున్నందుకు, మరి అలాగే క్షుద్బాధ ను తీర్చడం కోసం ఓ తపస్వి వలె తన ను తాను అంకితం చేసుకొన్నందుకు డాక్టర్ స్వామినాథన్ ను మరొక్క మారు నేను నా మనసారా అభినందిస్తున్నాను.

సౌహార్దపూర్వకమైన అభినందన లు.

మీకు ధన్యవాదములు.