Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి తో ఫ్రాన్స్ కు చెందిన ఎమ్‌ఇడిఇఎఫ్ అధ్య‌క్షుని భేటీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఎమ్‌ఇడిఇఎఫ్ (Mouvement des Entreprises de France) అధ్య‌క్షుడు శ్రీ పియ‌రీ గాటజ్ ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి 2015, ఏప్రిల్ లో తాను ఫ్రాన్స్ లో ప‌ర్య‌టించినప్పుడు ఫ్రాన్స్ కు చెందిన అనేక మంది వ్యాపార రంగ ప్ర‌ముఖుల‌తో ముఖాముఖి ముచ్చ‌టించిన సంగతిని గుర్తుకుతెచ్చుకొన్నారు. గ‌త కొన్నేళ్ళుగా భారతదేశం మరియు ఫ్రాన్స్ ల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాల‌ను ప‌టిష్ట ప‌ర‌చ‌డంలో ఇరు దేశాల వ్యాపార రంగ ప్ర‌ముఖులు అందించినటువంటి అమూల్య‌మైన తోడ్పాటును ప్ర‌ధాన మంత్రి అభినందించారు.

భార‌త‌దేశానికి, ఫ్రాన్స్‌కు మ‌ధ్య వ్యాపార సంబంధాలు మ‌రియు పెట్టుబ‌డి సంబంధాలు వ‌ర్ధిల్లుతున్న సంగ‌తిని శ్రీ గాటజ్ ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.

భార‌త‌దేశానికి విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డిని స‌మ‌కూర్చుతున్న అగ్ర‌గామి 10 మార్గాల‌లో ఫ్రాన్స్ ఒక‌టిగా ఉన్న విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. భార‌త‌దేశంలో వ్యాపార సంబంధ‌మైన వాతావ‌ర‌ణం మెరుగు ప‌డుతుండ‌డం, అలాగే పెట్టుబ‌డి అవ‌కాశాలు పెరుగుతూ ఉండ‌డం తాలూకు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌ల‌సిందిగా ఫ్రెంచ్ కంపెనీల‌ను శ్రీ మోదీ కోరారు.