Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్ ఇంకా ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేశన్ రంగంలో స‌హ‌కారం కోసం భార‌త‌దేశం మ‌రియు సింగ‌పూర్ ల మ‌ధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్ ఇంకా ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేశన్ రంగంలో స‌హ‌కారం కోసం భార‌త‌దేశం మ‌రియు సింగ‌పూర్ ల మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంత‌కాల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ముఖ్యాంశాలు:

ఈ ఎమ్ఒయు ప్ర‌స్తుత ప్ర‌భుత్వ పాల‌న వ్య‌వ‌స్థ‌ ను మెరుగుప‌ర‌చ‌డానికి- ప్రత్యేకించి శ్రామికులు, ప‌ని ప్ర‌దేశం మ‌రియు ఉద్యోగాలు, ప్ర‌జా సేవ‌ల అంద‌జేత, మాన‌వ వ‌న‌రుల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌భుత్వ రంగ సంస్క‌ర‌ణ‌లు, నాయ‌క‌త్వం/ప‌్ర‌తిభా వికాసం మ‌రియు ఇ-గ‌వ‌ర్నెన్స్‌/డిజిట‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ రంగాల‌లో మెరుగుదలకు ఉద్దేశించినటువంటిది.

ప్ర‌యోజ‌నాలు:

ఈ ఎమ్ఒయు ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేశన్ మ‌రియు పాల‌న సంస్క‌ర‌ణ‌ల రంగంలో భార‌త‌దేశానికి, సింగ‌పూర్ కు మ‌ధ్య స‌హ‌కారానికి సంబంధించిన ఒక ఫ్రేమ్ వ‌ర్క్ ను స‌మ‌కూరుస్తుంది.

ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేశన్‌, సుప‌రిపాల‌న, ప్ర‌జా సేవా సంస్క‌ర‌ణ‌లు.. వీటిలో శ్రేష్ఠ‌త్వాన్ని సాధించేందుకు ఈ ఎమ్ఒయు ను ల‌క్షించారు. త‌ద్వారా ప్ర‌భుత్వ జ‌వాబుదారుత‌నం మరింతగా పెరిగేందుకు మార్గం సుగ‌మం అవుతుంది.

ఆన్‌లైన్ ప‌బ్లిక్ స‌ర్వీస్ డెలివ‌రీ కి మెరుగులు దిద్దే అంశం లో ప్ర‌భుత్వ పాల‌న లో శ్రేష్ఠ‌త్వాన్ని సాధించేందుకు న‌వీన త‌ర‌హా ఉత్త‌మ అభ్యాసాల‌ను ప్ర‌వేశ‌పెట్టడం కోసం కూడా ఈ ఎమ్ఒయు ను ఉద్దేశించారు.

***