Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిన్ లాండ్ ప్రధాన మంత్రి తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి


ఫిన్ లాండ్ ప్రధాన మంత్రి, శ్రేష్ఠుడు శ్రీ జుహా శిపిల సోమవారం నాడు టెలిఫోన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సంభాషించారు.

చరిత్రాత్మకమైన రీతిలో వస్తువులు, సేవల పన్ను ను విజయవంతంగా అమలుచేసినందుకుగాను ప్రధాన మంత్రిని శ్రీ శిపిల అభినందించారు.

ఇరువురు నేతలు ఇదివరకు 2016 ఫిబ్రవరిలో తమ సమావేశం తరువాత ద్వైపాక్షిక సంబంధాలలో చోటు చేసుకొన్న పురోగతిని సమీక్షించారు. అప్పట్లో ముంబయిలో నిర్వహించిన ‘మేక్ ఇన్ ఇండియా వారం’లో పాలుపంచుకోవడానికిగాను శ్రీ శిపిల భారతదేశంలో పర్యటించారు. ద్వైపాక్షిక వ్యాపారం మరియు పెట్టుబడి బంధాన్ని గాఢతరంగా మార్చుకోగలిగేందుకు అనువైన మార్గాలను గురించి కూడా ఉభయ నేతలు చర్చించారు.

***