పిఎంఇండియా
బి ఆర్ ఐ సి ఎస్ నెట్ వర్క్ యూనివర్సిటీ ఏర్పాటు పై బి ఆర్ ఐ సి ఎస్ దేశాల మధ్య కుదిరిన అవగాహన పూర్వక ఒప్పందానికి (ఎంఓయూ) కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. 2015, నవంబర్ లో రష్యాలోని మాస్కోలో జరిగిన 3వ బి ఆర్ ఐ సి ఎస్ విద్యాశాఖ మంత్రుల సమావేశం సందర్భంగా బి ఆర్ ఐ సి ఎస్ నెట్ వర్క్ యూనివర్సిటీ అంశంపై సంప్రదింపులు సాగాయి. బి ఆర్ ఐ సి ఎస్ దేశాల మధ్య శాస్త్రీయ పరిశోధనలు, ఉన్నత విద్య, సమాచార మార్పిడి, విశ్లేషణ, ఉత్తమ పద్ధతుల అమలు, సంయుక్త పరిశోధనా కార్యక్రమాలు వంటివి పెంపొందించుకోవడం, విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు ఒక దేశం నుంచి మరొక దేశానికి రాకపోకలు జరపడం కోసం ఇతోధిక సహకారానికి ఈ ఎంఓయూ వీలు కల్పిస్తుంది.