పిఎంఇండియా
భగవాన్ హనుమాన్ జీ భక్తికి, శక్తికి, అచంచల అంకితభావానికీ సాటి లేని ప్రతీక అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఆ మహాశక్తిమంతుని కరుణతో భక్తులందరిలో ధైర్యసాహసాలతో పాటు సకారాత్మకత నిండాలి’’ అని శ్రీ మోదీ ప్రార్థించారు.
ఈ కింది సంస్కృత శ్లోకాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు:
‘‘మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి.’’
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘భగవాన్ హనుమాన్ జీ భక్తి, శక్తి, అచంచల అంకిత భావాల అద్వితీయ ప్రతీక. ఆ మహాబలి కృపతో, ఆయన భక్తులందరిలో సాహసం, సకారాత్మకత ప్రసరించు గాక.
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి’’ అని పేర్కొన్నారు.
भगवान हनुमान जी भक्ति, शक्ति और अटूट समर्पण के अद्वितीय प्रतीक हैं। महाबली की कृपा से उनके सभी भक्तों में साहस और सकारात्मकता का संचार हो।
— Narendra Modi (@narendramodi) April 2, 2026
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि॥ pic.twitter.com/uRHJbfJnH3