పిఎంఇండియా
భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినోత్సవం సందర్భంగా అందులోని సైనికులు, అధికారులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలను తెలియజేశారు. భారతీయ కోస్తా తీర రక్షక దళం మన సముద్ర తీరం పొడవునా ఒక దృఢమైన కవచంగా నిలిచి తన ప్రతిష్ఠను చాటుతోందని శ్రీ మోదీ అన్నారు. నౌకావాణిజ్యానికి భద్రతను కల్పించడంలోనూ, వైపరీత్యాలు ఎదురైనప్పుడల్లా సత్వరం రంగంలోకి దిగి అవసరమైన రక్షణ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ ఈ దళం తిరుగులేని నిబద్ధతను నిరూపిస్తోందనీ, మన నౌకావాణిజ్య అనుబంధ విస్తారిత వ్యవస్థను ఇది పరిరక్షిస్తున్న తీరు ప్రశంసనీయమనీ ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినోత్సవం సందర్భంగా ఆ దళంలోని సైనికులు, అధికారులందరికీ శుభాకాంక్షలు. వారు మన సముద్ర తీరం పొడవునా దృఢ రక్షాకవచంగా నిలుస్తూ, ప్రసిద్ధి పొందారు. నౌకావాణిజ్య భద్రతకు వారు తిరుగులేని నిబద్ధతను చాటి చెబుతున్నారు. వైపరీత్యాలు ఎదురైనప్పుడల్లా తక్షణం రంగంలోకి దిగి అవసరమైన రక్షణ, సహాయక చర్యలను చేపడుతున్నారు. అలాగే మన నౌకావాణిజ్య అనుబంధ విస్తారిత వ్యవస్థను ఈ దళం పరిరక్షిస్తున్న తీరు కూడా ప్రశంసనీయంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
On their Raising Day, greetings to all the ranks of the Indian Coast Guard. They have made a mark for standing as a steadfast shield along our shores. Their unwavering commitment to maritime security, swift disaster response and protection of our marine ecosystem is commendable.… pic.twitter.com/3RwutmiWgW
— Narendra Modi (@narendramodi) February 1, 2026
****
MJPS/VJ