Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్‌లో గౌరవ లిచ్టెన్‌స్టెయిన్ యువరాజు అలోయిస్ పర్యటన

భారత్‌లో గౌరవ లిచ్టెన్‌స్టెయిన్ యువరాజు అలోయిస్ పర్యటన


భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. గౌరవ లిచ్టెన్‌స్టెయిన్ యువరాజు అలోయిస్ భారత్‌లో పర్యటించిన్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో పాల్గొన్నారు.

సదస్సు సందర్భంగా గౌరవ యువరాజు అలోయిస్‌తో 2026 ఫిబ్రవరి 20న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారుభారత్లిచ్టెన్‌స్టెయిన్ మధ్య సుహృద్భావస్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలున్నాయని ఇరువురు నేతలూ స్పష్టం చేశారు.

2025 అక్టోబరులో భారత్ – టీఈపీఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలును వారిద్దరూ స్వాగతించారుఈ ఒప్పందం ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు కొత్త ఉత్తేజాన్నిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారువచ్చే 15 ఏళ్లలో ఈ ఒప్పందం ద్వారా భారత్‌లోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారుముఖ్యంగా అత్యున్నత విలువ కలిగిన ఉత్పాదకతఅత్యాధునిక సాంకేతికతలుఆవిష్కరణల ఆధారిత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు.

భారత్ – లిచ్టెన్‌స్టెయిన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక కీలక ముందడుగురెండు దేశాలకూ ప్రయోజనకరమైన సహకారాన్ని విస్తరించుకునే దిశగా ఉమ్మడి నిబద్ధత ఈ సమావేశం ద్వారా స్పష్టమవుతోంది.

 

****