పిఎంఇండియా
ప్రముఖ బెంగాలీ రచయిత శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
బెంగాలీ సాహిత్యంలో ఒక మహోన్నత వ్యక్తిగా శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ ను కొనియాడుతూ, ప్రజల జీవితాలను ఎంతో సున్నితత్వంతో, లోతైన అవగాహనతో చిత్రీకరించిన రచయితగా ప్రధాని ప్రశంసించారు.
“ శంకర్ అని అందరూ ప్రేమగా పిలిచే శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన బెంగాలీ సాహిత్యంలో ఒక మహోన్నత వ్యక్తి. ఆయన రచనలు ప్రజల జీవితాలను ఎంతో సున్నితత్వంతో, లోతైన అవగాహనతో ప్రతిబింబించాయి. మరువలేని రచనల ద్వారా ఆయన తరతరాల పాఠకులను ప్రభావితం చేయడమే కాకుండా భారత సాహిత్య ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్టు చేశారు.
***
Deeply saddened by the passing of Shri Mani Shankar Mukhopadhyay Ji, fondly known as Shankar.
— Narendra Modi (@narendramodi) February 20, 2026
He was a towering figure in Bengali literature whose words portrayed the lives of people with sensitivity and insight. Through his unforgettable works, he impacted generations of…