Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ – ఫ్రాన్స్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం; 16 ఒప్పందాలపై సంతకాలు

భారత్ – ఫ్రాన్స్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం; 
16 ఒప్పందాలపై సంతకాలు

భారత్ – ఫ్రాన్స్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం; 
16 ఒప్పందాలపై సంతకాలు

భారత్ – ఫ్రాన్స్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం; 
16 ఒప్పందాలపై సంతకాలు


చండీగఢ్లో ఈరోజు జరిగిన భారత్ – ఫ్రాన్స్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సీఓపీ – 21 సంప్రదింపులను ఫ్రాన్స్ సమన్వయ పరచిన తీరును ప్రధాని అభినందించారు. ప్రతిపాదిత ఒప్పందం గురించి ప్రకటించే ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఫ్రాంకోయిస్ హోలాండే ఫోన్ లో తనతో మాట్లాడి, ఆ ఒప్పందం రూపు రేఖలను తెలియజేసిన విషయాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

సీఓపీ – 21 సమావేశాలకు కొద్ది రోజుల ముందు పారిస్ లో జరిగిన ఉగ్రవాదుల మారణకాండను కూడా ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. ఫ్రాన్స్ తన మౌలిక సిద్ధాంతాల నుంచి పక్కకు తప్పుకోకుండానే ఉగ్రవాదంపై ఎలా పోరాడాలో ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ఉగ్రవాదానికి ఎదురొడ్డి నిలచి పోరాడడంలో ఫ్రాన్స్ తో భారత్ భుజం భుజం కలిపి నిలబడుతుందన్నారు.

భారత్, ఫ్రాన్స్ లకు మధ్య అనేక అంశాలలో పోలికలు ఉన్న సంగతిని ప్రధాన మంత్రి చెబుతూ, నిజానికి ఈ రెండు దేశాలూ ఒకదాని కోసం మరొకటి నిలబడుతున్నాయన్నారు. భద్రత, రక్షణ రంగాల గురించి ఆయన మాట్లాడుతూ – భారత ప్రావీణ్యం, ఫ్రెంచ్ తయారీ సామర్థ్యం కలబోసుకుంటే ఈ ప్రపంచాన్ని మరింత పదిలమైన ప్రదేశంగా మలచగలవన్నారు. సైబర్ భద్రత గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

భారత దేశంలో ఫ్రెంచ్ కంపెనీలు బాగా పెట్టుబడులు పెట్టాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పాత తేదీ నుంచి విధించే పన్ను (రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్) అనేది గత కాలపు విషయమని, అది ముగిసిన అధ్యాయమని కూడా ఆయన స్పష్టం చేశారు. భారతదేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఫ్రాన్స్ ల ప్రమేయమున్న మిషన్ ఇన్నోవేషన్, ఇంకా ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ కార్యక్రమాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉటంకించారు.

శిఖరాగ్ర సమావేశంలో మొత్తం 16 అవగాహన పూర్వక ఒప్పందాలు (ఎంఓయూ లు), ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.