పిఎంఇండియా
ప్రముఖ నటుడు మహానాయక్ ఉత్తమ్ కుమార్ శత జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఉత్తమ్ కుమార్ను ఓ దిగ్గజం అని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తమ్ కుమార్ సాటిలేని నటన, కాలాతీతంగా అన్ని తరాల ప్రజల మనసులను అలరిస్తోందన్నారు. ఆ ప్రముఖ నటుడిని గురించి ఇటీవల ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా శ్రీ మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘మహానాయక్ ఉత్తమ్ కుమార్ ఓ దిగ్గజం. సాటి లేని ఆయన నటన, కాల ప్రభావాన్ని అధిగమించి మరీ అన్ని తరాల ప్రజలనూ అలరిస్తోంది.
ఆయన శత జయంతి సందర్భంగా ఇవే నివాళులు.
పోయిన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయనను గురించి నేను చెప్పిన మాటలను మరో సారి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
মহানায়ক উত্তম কুমার… এক কিংবদন্তি যাঁর কালজয়ী পরিবেশনা প্রজন্মান্তরের… pic.twitter.com/GQLr48AO7o
— Narendra Modi (@narendramodi) September 3, 2026
Mahanayak Uttam Kumar...a legend whose timeless performances connect with people across generations.
— Narendra Modi (@narendramodi) September 3, 2026
Tributes on his birth centenary.
Also sharing what I spoke about him during #MannKiBaat last Sunday.
মহানায়ক উত্তম কুমার... এক কিংবদন্তি যাঁর কালজয়ী পরিবেশনা প্রজন্মান্তরের… pic.twitter.com/GQLr48AO7o