Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ ఆత్మకథను ఆవిష్కరించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

మాజీ రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ ఆత్మకథను ఆవిష్కరించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్మై లైఫ్మై స్ట్రగుల్స్’ పేరుతో భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ రచించిన ఆత్మకథను న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆవిష్కరించారుసభనుద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘శ్రీ రాంనాథ్ కోవింద్ ఆత్మకథను ఆవిష్కరించుకునే అవకాశం ఈ రోజు మనకు లభించిందిఈ కార్యక్రమంలో భాగస్వామిని కావడం నాకెంతో సంతోషాన్నిస్తోంది’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు.

శ్రీ రాంనాథ్ కోవింద్‌తో ప్రగాఢమైన తన వ్యక్తిగత అనుబంధాన్ని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్లుగా ఆయన మార్గనిర్దేశంఆప్యాయతల పట్ల అపారమైన గౌరవాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ‘‘శ్రీ కోవింద్‌తో నాకు సుదీర్ఘ పరిచయముందిఆయనను దగ్గరగా చూసే అదృష్టం కలిగిందిరాష్ట్రపతి హోదాలో వారి మార్గనిర్దేశం మరువలేనిదిఅన్నిటికన్నా ముఖ్యంగా.. నా పట్ల వారికున్న ప్రత్యేకమైన ఆప్యాయతానురాగాలే నాకు గొప్ప సంపద’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

శ్రీ కోవింద్ వ్యక్తిత్వ ఔన్నత్యాన్నీ, సమర్థతనూ శ్రీ మోదీ ప్రశంసించారుఆయన రచన దేశ ప్రజాస్వామ్య విలువలకు శాశ్వత నిదర్శనంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. “శ్రీ రాంనాథ్ కోవింద్ ఆత్మకథ దేశ ప్రజాస్వామ్యానికీభారతీయ సమాజానికీ గొప్ప వారసత్వ సంపదగా నిలుస్తుందని పూర్తి నమ్మకంతో చెప్పగలను’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

శ్రీ కోవింద్ దేశానికి అందించిన అపారమైన సేవలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. పుస్తకంలోని వివరాలను ఎక్కువగా వెల్లడించకుండా.. పాఠకులే స్వయంగా చదివి ఆ విశేషాలను తెలుసుకోవాల్సిందిగా ప్రోత్సహించారు. ‘‘పుస్తకావిష్కరణ సమయంలో గ్రంథ పరిచయం మాత్రమే ఉండాలిమీరంతా ఈ పుస్తకాన్ని మొత్తం చదివితేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

యువతరానికి ఎన్నో విద్యాపరమైన మార్గదర్శక విలువలను కూడా ఈ ఆత్మకథ అందిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి మాటల నుంచి భావి తరాలు ప్రేరణ పొందాలని ఆకాంక్షించారు. ‘‘దేశ నవతరం కూడా ఆయన రచనలనూఅనుభవాలనూ చదవాలివీటి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

పుస్తకం పేరు ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్మై స్ట్రగుల్స్’ను విశ్లేషించారువ్యక్తిగత కష్టాలను అధిగమించడంతోపాటుదేశ ప్రజాస్వామ్య విజయమనే రెండు ముఖ్యమైన అంశాలు అందులో భాగంగా ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు. ‘‘జీవిత పోరాటాలు ఆయన వ్యక్తిగతంఅయితేఆ పోరాటాల ద్వారా సాధించిన విజయం భారత్‌దీదేశ ప్రజాస్వామ్యానిదీ’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

శ్రీ రాంనాథ్ కోవింద్ ఉదారమైన ఆలోచనలు సగటు మనిషి సహజ ధోరణికి భిన్నమైనవన్నారు. చాలామంది తమ కష్టాలకు సమాజాన్ని నిందిస్తుంటారనీకానీ భారతీయ విలువల్లో బలంగా వేళ్లూనుకున్న శ్రీ కోవింద్ హృదయం మాత్రం.. తన విజయంలో సమాజాన్ని కూడా భాగస్వామిగా భావిస్తుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘హృదయంలో ఔదార్యంభారతీయ విలువలు ఉంటే.. ఆ మనిషి సమాజంలో తప్పులు వెతుకుతూ సమయాన్ని వృథా చేయడుసమాజంలోని సానుకూల అంశాలపైనే దృష్టి సారిస్తాడు’’ అని శ్రీ మోదీ చెప్పారు.

 

ఈ ఆత్మకథలో పేర్కొన్న ఒక విషాదకరమైన చిన్ననాటి ఘట్టాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారుకాన్పూర్ దేహాత్‌లోని ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు.. నిత్యావసర వస్తువులను బయటకు తెచ్చే ప్రయత్నంలో.. శ్రీ రాంనాథ్ కోవింద్ తల్లి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ‘‘చిన్నతనంలోనే ఇలాంటి ప్రమాదం జరగడంఅలా తల్లిని కోల్పోవడం ఎంతటి వేదనను మిగిల్చి ఉంటుందో మీరు ఊహించవచ్చు’’ అని శ్రీ మోదీ అన్నారు.

 

ఈ విషాదానంతరం తిరిగి గుండెనిబ్బరాన్ని కూడగట్టుకున్న తీరును ప్రధానమంత్రి వివరించారుపొరుగున ఉన్న ఒక తల్లి శ్రీ కోవింద్ పెంపకంలో ఎలా తోడ్పడిందోఆ సంఘటన సామాజిక సామరస్యంపై ఆయన అవగాహనను ఏ విధంగా లోతుగా ప్రభావితం చేసిందో శ్రీ మోదీ వివరించారు. ‘‘దీన్నుంచే సమాజ ఐక్యతసమరసతా శక్తిని ఆయన అర్థం చేసుకున్నారుఆ కష్టాలు శ్రీ రాంనాథ్ కోవింద్‌ను మరింత దృఢంగా మార్చాయి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ఆ విషాదం తర్వాత శ్రీ కోవింద్ తండ్రి వ్యవహరించిన స్ఫూర్తిమంతమైన తీరును ప్రధానమంత్రి వివరించారుఆయన కుటుంబాన్ని నడిపించిన విధానంపిల్లల్లో బలమైన విలువలను నూరిపోసిన విధానాన్ని గుర్తుచేశారు. ‘‘ఆయన కుటుంబాన్ని నడిపించిన తీరుపిల్లలకు విలువలను నేర్పించిన విధానం వల్లే.. శ్రీ కోవింద్ తన తండ్రిని హీరోగా భావిస్తారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

పేదరికాన్ని అధిగమించడానికి శ్రీ కోవింద్ విద్యనే ఆసరాగా చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారుదేశ అత్యున్నత పదవిని చేపట్టేలా ఎదిగిన ఆయన అసాధారణ ప్రస్థానాన్ని వివరించారు. ‘‘ఆయన కష్టపడ్డారుపేదరికాన్ని బలహీనతగా మారనివ్వలేదుఆ రోజుల్లో ప్రజలు కనీసం ఊహించను కూడా లేని అత్యున్నత స్థానానికి ఎదిగారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

మాజీ రాష్ట్రపతి నిరాడంబరతను, వినయాన్ని ప్రధానమంత్రి కొనియాడారుశ్రీ కోవింద్ తన స్వగ్రామం పరోంఖ్‌కు వచ్చినప్పుడు.. అక్కడి నేలకు నమస్కరించితన పూర్వ ఉపాధ్యాయుల పాదాలను తాకిన భావోద్వేగభరితమైన ఘట్టాన్ని గుర్తుచేశారు. ‘‘ఆయన నడవడి.. భారతీయ విలువలను ప్రపంచం ముందు నిలిపిందిప్రతి భారతీయుడికీ అది గర్వకారణం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

శతాబ్దాల పరాధీనత వల్ల ఎదురైన సామాజిక – ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రస్తావిస్తూ… మహాత్మాగాంధీబాబాసాహెబ్ అంబేడ్కర్జ్యోతిబాపూలే వంటి చరిత్రాత్మక మహనీయుల నిరంతర పోరాటాలనూదూరదృష్టి కలిగిన వారి స్వప్నాలనూ ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ‘‘అత్యంత నిరుపేద కూడా అత్యున్నత స్థానానికి చేరుకునే అవకాశం లభించేలా.. నవభారత పునర్నిర్మాణం జరగాలని అలాంటి మహానీయులెందరో కలలుగన్నారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ఈ చారిత్రక ఆకాంక్షలనూఆధునిక విజయాలనూ ముడిపెడుతూ… కఠోర శ్రమ ద్వారా సమసమాజ స్థాపన అనే శతాబ్దాల నాటి నినాదాన్ని సాకారం చేయడంలో కోవింద్ వంటి ఎందరో ప్రముఖులు కీలక పాత్ర పోషించారంటూ శ్రీ మోదీ ప్రశంసించారు. ‘‘శ్రీ కోవింద్ వంటి వ్యక్తులు కష్టపడే తత్త్వంతోసామర్థ్యంతో జీవితాలను తీర్చిదిద్దుకోవడం మాత్రమే కాదు.. శతాబ్దాల నాటి ఆ కలను సాకారం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిబద్ధత కలిగిన యువత ఎల్లప్పుడూ అత్యావశ్యకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఆటంకాలకు జంకకుండాదేశ ఆత్మనిర్భరత దిశగా మార్గం సుగమం చేసేలా ధైర్యంగా ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ‘‘ఈ మార్పుతోనే సాధికారిక భారత్‌ను నిర్మించాలన్న సంకల్పం సాకారమవుతుందిఆత్మనిర్భరవికసిత భారత్ నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

అత్యంత ప్రేరణదాయకమైనదిగా ఈ ఆత్మకథను పేర్కొంటూ… అత్యావశ్యకమైన ఇలాంటి యువశక్తిని తీర్చిదిద్దేందుకు శ్రీ కోవింద్ జీవిత విశేషాలు కచ్చితమైన మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి అన్నారు. ‘‘అలాంటి యువశక్తి నిర్మాణం కోసం కావాల్సిన ప్రేరణను శ్రీ కోవింద్ ఆత్మకథ అందిస్తుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

శ్రీ కోవింద్ రాజకీయ జీవిత ప్రారంభాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అంతర్గతంగా దేశసేవా భావన ఉన్న ఆయన పూర్తిస్థాయి రాజకీయాల దిశగా పయనం సాగించేందుకు.. మొరార్జీ దేశాయ్‌ సాహచర్యం ఏ విధంగా దోహదం చేసిందీ శ్రీ మోదీ వివరించారు. ‘‘ఆయనలో అంతర్గతంగా ఉన్న దేశసేవా తత్పరతకు.. మొరార్జీతో కలిసి పనిచేయడం ద్వారా ఒక సరైన మార్గం లభించింది’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ఆయన సుదీర్ఘ సేవా ప్రస్థానాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. పార్లమెంటులో వివిధ పాత్రల్లోగవర్నరుగాఆపై రాష్ట్రపతిగా వివిధ హోదాల్లో శ్రీ కోవింద్ కనబరిచిన అచంచలమైన కర్తవ్యనిష్ఠను ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘‘సేవే లక్ష్యంగా ఆయన పనిచేశారుపార్లమెంటులో ఆయన బాధ్యతల నిర్వహణ తీరు దీనిని స్పష్టం చేస్తోంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత కూడా శ్రీ కోవింద్ అవిశ్రాంత కృషిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగల.. ‘ఒక దేశంఒకే ఎన్నిక’ వంటి కీలకమైన జాతీయ అంశాల్లో ఆయన నేతృత్వం వహిస్తుండడాన్ని ప్రశంసించారు. ‘‘శ్రీ కోవింద్ కర్తవ్య దీక్షసేవాభావాల నుంచి దేశ ప్రజలు ఎంతగానో నేర్చుకోగలరన్న దృఢమైన విశ్వాసం నాకుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

 

ప్రజాజీవితంలో అత్యంత క్రియాశీలంగా ఉంటూ కూడా ఆత్మకథను రాయడం అత్యంత కష్టతరమైన విషయమని శ్రీ మోదీ అన్నారు. సమాజానికి ఎంతో కీలకమైన ఈ రచనను పూర్తి చేసినందుకు శ్రీ కోవింద్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ‘‘శ్రీ కోవింద్ మనందరి కోసం ఈ రచన చేశారుపేదఅట్టడుగు వర్గాల ప్రజల జీవితానికి అది అద్దం పడుతుందివారంతా తమ జీవిత ఛాయలను అందులో చూసుకోవచ్చు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ఈ రచనలోని విస్తృతమైన నైతిక పాఠాలను వివరిస్తూ.. అత్యంత కఠినమైన సమయాల్లోనూ పవిత్రతకూనిజాయితీకీ కట్టుబడి ఉండడం ద్వారా లభించే అత్యున్నత శక్తిని మాజీ రాష్ట్రపతి జీవిత చరిత్ర చాటుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘వివిధ పదవుల్లో బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. దేశసేవకు అవసరమైన శక్తిని ఈ పవిత్రత మనకు ఎంతలా అందిస్తుందనే విషయంలో శ్రీ కోవింద్ సమాజానికి నిరంతర స్ఫూర్తిగా నిలిచారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

ఇది చరిత్రాత్మక రచనగా నిలుస్తుందని పేర్కొంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. వ్యక్తిగతజాతీయ ప్రాధాన్యం కలిగిన ఘట్టాల అత్యావశ్యక నిధి (ఆర్కైవ్)గా ఈ రచన నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘శ్రీ రాంనాథ్ కోవింద్ ఆత్మకథ ఆయన జీవిత జ్ఞాపకాలనే కాకుండా.. మన ప్రజాస్వామ్య ప్రస్థానంలోని ఘట్టాలనూ పదిలపరుస్తుందన్న దృఢమైన నమ్మకం నాకుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

***