పిఎంఇండియా
2026 మార్చి 6వ తేదీ ఉదయం 11:15 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ‘వ్యవసాయం, గ్రామీణ పరివర్తన’ అనే అంశంపై నిర్వహించే ‘బడ్జెట్ అనంతర వెబినార్’ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
(i) వ్యవసాయం (ii) పశుసంవర్ధక, పాడిపరిశ్రమ (iii) మత్స్య రంగం (iv) గ్రామీణ జీవనోపాధి.. ఇలా నాలుగు ప్రధాన రంగాల్లో ఎనిమిది వేర్వేరు వెబినార్ సెషన్లు నిర్వహించనున్నారు.
ఈ బడ్జెట్ అనంతర వెబినార్.. జీడిపప్పు, కొబ్బరి, గంధం, అగర్వుడ్, బాదం, వాల్నట్స్, పైన్ నట్స్ వంటి పంటల సామర్థ్యాన్ని వెలికితీయడం ద్వారా అధిక విలువ కలిగిన వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. అలాగే వ్యవసాయం కోసం రూపొందించిన ఏఐ–ఆధారిత డిజిటల్ ప్రజా మౌలికసదుపాయమైన ‘భారత్ విస్తార్‘ కల్పించే అవకాశాల గురించి కూడా ఇందులో చర్చిస్తారు. పశుసంవర్ధక విలువ గొలుసులో ప్రైవేట్ రంగ పెట్టుబడులు, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం.. మత్స్య సంపద కోసం జలాశయాలు, అమృత్ సరోవరాల సమగ్ర అభివృద్ధి, తీరప్రాంత మత్స్య విలువ గొలుసుల బలోపేతం వంటి అంశాలపై కూడా ఈ సెషన్లలో చర్చించనున్నారు. ‘షీ–మార్ట్స్‘ ద్వారా గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను విస్తరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.
***