పిఎంఇండియా
హలో, నా యువ మిత్రులారా,
నమస్తే
మీరు సమయాన్ని చక్కగా గడుపుతున్నారనుకుంటాను.
మీకు, కోల్డ్ ప్లే కు మధ్య నేను విచ్చేశానన్న సంగతిని నేను ఎరుగుదును అందుకే నేను క్లుప్తంగానే మీతో సంభాషిస్తాను.
ఇదివరకు 2014లో, న్యూ యార్క్ లోని సుందరమైన సెంట్రల్ పార్క్ లో జరిగిన ది గ్లోబల్ సిటిజన్స్ ఫెస్టివల్ కు హాజరు కావడాన్ని నేను ఆనందించాను.
అయితే, ఈసారి, నా నిర్ణీత కార్యక్రమాల పట్టిక నన్ను ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరు కావడానికి వీలు కల్పించేదిగా లేదు.
అయినప్పటికీ, నేను మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం భారతదేశంలో జరుగుతున్నందున దీనికి దూరంగా ఉండదల్చుకోలేదు.
ఈ కారణంగానే నేను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా మీ ముందుకు వచ్చాను.
మీలో అనేక మంది ఇప్పటికే నా మొబైల్ యాప్ ద్వారా నాతో అనుసంధానమై ఉన్నారు.
మీ ప్రతిస్పందనలు మరియు సలహాల కోసం ఇక ముందు కూడా నేను ఎదురుచూస్తుంటాను.
యువ వర్గాల మధ్య గడపడానికి నేను ఎల్లప్పటికీ సిద్ధమే.
ఇది నాకు తాజాదనాన్నిస్తుంది; నాలో కొత్త శక్తిని నింపుతుంది కూడా.
మీరు అందించే శక్తి, ఆదర్శవాదం సాటిలేనివి.
నేను మీ నుండి వందలాది కిలోమీటర్ల ఆవల ఉన్న కూడా దీనిని అనుభూతించగలుగుతున్నాను.
ఇది నా పాత దస్త్రాలతో నిండిన సాధారణమైన రోజువారీ పని నుండి, చలిగా ఉండే ఢిల్లీ నుండి స్వాగతించదగిన విరామం.
హ్యూ ఇవాన్స్, శివ్ ఖేమ్ కా, గౌరి ఈశ్వరన్, పూనమ్ మహాజన్, ఇంకా ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో పాటుపడిన మరెందరినో నేను అభినందిస్తున్నాను.
కూల్ పబ్లిక్ పాలసీని రూపొందించడం చిన్న పనేమీ కాదు!
నన్ను కూడా కలుపుకొంటున్నందుకు మీకు ఇవే నా ధన్యవాదాలు.
సభను ఉద్దేశించి నన్ను పాడమని అడగకుండాకేవలంప్రసంగించమని నన్ను అడిగి మీరు వివేకాన్ని ప్రదర్శించారు.
ఈ పనిని మీరు చేసి వుంటే, శ్రోతలు వారి డబ్బును వాపసు చేయండని మిమ్మల్ని అడిగేవాళ్లు; ఈ విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేనేలేదు.
అది కూడా 100 రూపాయల నోట్ల రూపంలో తిరిగి ఇమ్మని వాళ్లు అడిగే వాళ్లు.
गरीबी किसी भी सभ्य समाज के लिए बहुत बड़ा अभिशाप है।
कुपोषण हो, बेरोजगारी हो, भ्रष्टाचार हो, अस्वच्छता हो , इसका सबसे ज्यादा असर गरीबों पर ही पड़ता है ।
इसलिए, सबका साथ, सबका विकास के मंत्र के साथ ये सरकार गरीबों को सशक्त करने का काम कर रही है। पिछले दो साल से देश में स्वच्छता का महाअभियान चल रहा है।
लोग अपने आसपास सफाई के प्रति , गंदगी ना करने के प्रति जागरूक हुए हैं।
करोड़ों की संख्या में घरों में शौचालयों का निर्माण हो रहा है।
शहरों में वेस्ट मैनेजमेंट के लिए इंफ्रास्ट्रक्चर तैयार किया जा रहा है।
स्वच्छता अभियान को जन-जन के जोश ने जनआंदोलन में बदल दिया है, और आज ये जन-जन के आनंद में भी बदल रहा है ।
इस मुहिम में आप नौजवानों ने मिलकर देश को राह दिखाई है।
अगर कोई बड़ा गंदगी कर रहा है, तो आपने उसे टोका है, उसे स्वच्छता का महत्व समझाया है।
आपने खुद झाड़ू उठाकर अपने आसपास की सफाई की है।
आपकी प्राथमिकता इसी बात से झलकती है कि आज “वर्ल्ड टॉयलेट डे” पर इस कार्यक्रम का आयोजन हो रहा है ।
देश के गली-मोहल्लों, गांवों और शहरों में सफाई के साथ ही स्वच्छता अभियान का दायरा भी बढ़ गया है।
आजकल बॉर्डर के पार की सफाई हो या कालेधन से भरी तिजोरियों के भीतर तक की सफाई, सब कुछ जोर-शोर से चल रहा है।
सफाई आंदोलन के इस दूसरे चरण में भी मुझे आपका अमूल्य साथ मिल रहा है।
నా యువ స్నేహితులారా, మొత్తంమీద.. మనం అన్ని రకాల మురికి నుండి కూడా విముక్తమైన ఓ ‘స్వచ్ఛ భారత్’ ను నిర్మించగలుగుతాము, నిర్మిస్తాము అని నాకు నమ్మకం ఉంది.
ఆ పనిని చేయాలని మీరు నిర్ణయించుకొన్న ఉత్తర క్షణాన మనం దానిని పూర్తి చేయగలమన్న సంగతి కూడా నాకు ఎరుకే.
అందువల్ల, ఈ స్వచ్ఛతా ఉద్యమంలో నాతో మీరు భుజం భుజం కలిపి అడుగులు వేస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞుడిని. అంతే కాకుండా, మీరు మీ సహకారాన్ని ఇక ముందూ కొనసాగిస్తారనే నేను భావిస్తున్నాను.
కోల్డ్ ప్లే ను ఆనందించేందుకు మీ నుండి సెలవు తీసుకొనే ముందు, నన్ను ఓ సంగీత స్వరంతో ముగించనీయండి.
కళాకారులు తరచు ఒక తరానికి స్ఫూర్తిమూర్తులుగా నిలుస్తూవచ్చారు. నాకు కూడా నా సొంత ఆదర్శమూర్తులు ఉన్నారు.
కానీ, మీకు బాబ్ డిలన్, నోరా జోన్స్, క్రిస్ మార్టిన్ ఇంకా ఎ.ఆర్. రహమాన్ లంటే మరింత పరిచయం ఉండి ఉండవచ్చు.
అందుకని డిలన్ ఆలపించిన పరిణామాత్మక గీతాలలో నుంచి ఒక గీతాన్ని.. దీనిని 1960వ దశకంలో మొట్టమొదటిసారిగా పాడినప్పటికీ ఈ రోజుకు కూడా బోలెడంత అర్థవంతంగా ఉన్న గీతాన్ని ఉదాహరిస్తాను.
Come mothers and fathers
Through-out the land.
And don’t criticize
What you can’t understand.
Your sons and your daughters
Are beyond your command.
Your old road is rapidly aging
Please get out of the new one
If you can’t lend your hand
For the times they are a-changing.
ఈ విజ్ఞాన భరితమైన మాటల నుండి పెద్దలు పాఠాలు నేర్చుకొనే తీరాలి.
నిజానికి మనం- కాలం మారుతోంది కాబట్టి- దారిలో నుండి వైదొలగడమే మంచిది.
व्यक्तिगत तौर पर, मुझे हमेशा ही युवा शक्ति ने प्रेरित किया है।
భారతదేశం ఓ యువ దేశం.
మరి మన భవిష్యత్తు మీరు చేసే ఎంపికల పైనే, ఆ మాటకొస్తే మీరు తీసుకొనే చర్యల ఆధారంగానే నిర్మితం అవుతోంది,
అందుకని, మీరు కూడా సమయోచితంగా నడచుకొంటూ, మన దేశాన్ని పరివర్తనకు లోను చేస్తున్న పవనాలు కావాలని నేను తలుస్తాను.
ఎందుకంటే, క్రిస్ తన గీతాలలో చెప్పినట్లు
You can see the change you want to
Be what you want to be
Everything you want is a dream away
Under this pressure under this weight
We are diamonds taking shape
We are diamonds taking shape.
ధన్యవాదాలు.
సంతోషంగా ఉండండి.
ఆ దైవం ఆశీస్సులు మీకు లభించు గాక.
***
I know that I stand between you and Cold Play and so will make this brief: PM @narendramodi begins his remarks at @glblctznIN
— PMO India (@PMOIndia) November 19, 2016
Back in 2014, I had enjoyed attending the Global Citizen Festival in the beautiful Central Park of New York: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2016
You bring an energy and idealism that is unparalleled: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5 @glblctznIN
— PMO India (@PMOIndia) November 19, 2016
गरीबी किसी भी सभ्य समाज के लिए बहुत बड़ा अभिशाप है : PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2016
कुपोषण हो, बेरोजगारी हो, भ्रष्टाचार हो, अस्वच्छता हो, इसका सबसे ज्यादा असर गरीबों पर ही पड़ता है : PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2016
पिछले दो साल से देश में स्वच्छता का महाअभियान चल रहा है : PM @narendramodi #MyCleanIndia @glblctznIN
— PMO India (@PMOIndia) November 19, 2016
My dear young friends, I am convinced we can and we will build a Swachh Bharat free of all forms of filth within one generation: PM
— PMO India (@PMOIndia) November 19, 2016
Delighted to join #GlobalCitizenIndia festival & talk about power of youth, music & the need for a Swachh Bharat. https://t.co/khcHI44JXD
— Narendra Modi (@narendramodi) November 19, 2016