Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబయి నావల్ డాక్ యార్డ్ లోని 73 చదరపు మీటర్ల భూమిని M/s. BEST కి కౌలుకు ఇవ్వడం


ముంబయి నావల్ డాక్ యార్డ్ లోని 73 చదరపు మీటర్ల రక్షణ శాఖ భూమిని మెస్సర్స్ బృహ‌న్ ముంబ‌యి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్ ( బి ఇ ఎస్ టి )కి సాలుకు ఒక రూపాయి నామమాత్రపు అద్దె పై లీజ్ కు ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ భూమి లీజ్ ఆరంభంలో 30 సంవత్సరాలకు ఉంటుంది. దీనిని మరో 30 సంవత్సరాల వంతున రెండు సార్లు పునర్ నవీకరించుకొనేందుకు వెసులుబాటు ఉంటుంది. నిర్మాణంలో ఉన్న కొత్త డ్రై డాక్ సదుపాయానికి విద్యుత్తు ను సరఫరా చేయడానికి ముంబయి లోని నావల్ డాక్ యార్డు వద్ద నాలుగో ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయడమే కాక భూగర్భంలో నీటి నిల్వ ట్యాంకు ను (పంప్ హౌస్ తో కూడా కలసినది) నిర్మించేందుకు కూడా ఇది వీలు కల్పించగలదు.

ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసే పనిని బి ఇ ఎస్ టి వారు తమ సొంత ఖర్చుతో చేపడుతారు. దీనిలో భారతీయ నౌకాదళానికి ఎటువంటి ఆర్థికపరమైన భారం పడబోదు.

పూర్వ రంగం:

నిర్మాణ పనులు సాగుతున్న కొత్త డ్రై డాక్ కు ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్తు సరఫరా సరిపోవడం లేదు. డాక్ యార్డు ఆవరణం లోపల అగ్నిప్రమాదాల రక్షణ నిమిత్తం అదనంగా ఒక ట్రాన్స్ ఫార్మర్ ను, ఇంకా పంప్ హౌస్ తో కూడిన ఒక అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజి ట్యాంకును ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. డాక్ యార్డ్ వద్ద 73 చదరపు మీటర్ల భూమిని M/s. BEST కు లీజ్ కు ఇవ్వడం వల్ల ఆ భూమిపై నౌకాదళం యాజమాన్యం కొనసాగుతుంది; అక్కడ ట్రాన్స్ ఫార్మర్ ను స్థాపించే మరియు పంప్ హౌస్ తో కూడిన అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజి ట్యాంకును నిర్మించే అధికారం మాత్రమే M/s. BEST కి ఉంటుంది.

ముంబయి నావల్ డాక్ యార్డు కు విద్యుత్తు సరఫరా ను M/s. BEST సమకూర్చుతుంది. ప్రస్తుతం అక్కడ మెయిన్ రిసీవింగ్ సబ్-స్టేషన్ వద్ద మూడు ట్రాన్స్ ఫార్మర్ లు ఉన్నాయి. వాటిని M/s. BEST నిర్వహిస్తూ ఉన్నది. ఇవి యార్డు లోని ప్రస్తుత ఫెసిలిటీ లకు మాత్రమే సేవలను అందిస్తున్నాయి.

***