Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యూత్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రాముల పై విదేశాలతో అవగాహనపూర్వక ఒప్పందాలు


యూత్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రాముల నిర్వహణపై బహ్రెయిన్, కువైట్, నేపాల్, దక్షిణ కొరియా, శ్రీలంక, వియత్నామ్, మరియు బి ఆర్ ఐ సి ఎస్ దేశాలతో అవగాహనపూర్వక ఒప్పందాలు (ఎమ్ ఒ యు లు) కుదుర్చుకొన్న సంగతిని మంత్రిమండలి దృష్టికి తీసుకువచ్చారు. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఇంటర్ నేషనల్ యూత్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రాములు వేరు వేరు దేశాలకు చెందిన యువతీయువకులలో ఆలోచనల, విలువల పరస్పర మార్పిడిని ప్రోత్సహించడానికి ఉద్దేశించినవి. ఈ కార్యక్రమాలు యువజనులలో అంతర్జాతీయ దృష్టికోణాన్ని పెంపొందింపచేయడంలోనూ తోడ్పడుతాయి. అంతే కాకుండా, ఒక దేశానికి, మరొక దేశపు ప్రజలకు సంబంధాలను నెలకొల్పడం ద్వారా దేశాల మధ్య శాంతిని, గ్రహణ శక్తిని ఈ కార్యక్రమాలు వర్ధిల్లజేయగలుగుతాయి. ఆయా దేశాల మధ్య స్నేహ సంబంధాలను సైతం పటిష్టపరచగలుగుతాయి.

***