Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లావోస్ లోని వియెన్ తియెన్ లో 14వ ఆసియాన్-భారతదేశం శిఖరాగ్ర సమావేశానికి మరియు 11వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్న ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2016 సెప్టెంబరు 7వ తేదీ నుండి 2016 సెప్టెంబరు 8వ తేదీ వరకు లావోస్ రాజధాని నగరం వియెన్ తియెన్ లో జరిగే 14వ ఆసియాన్-భారతదేశం శిఖరాగ్ర సమావేశం మరియు 11వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు.

తన ఫేస్ బుక్ అకౌంట్ లో ప్రధాన మంత్రి ఇలా పేర్కొన్నారు:

“ నేను 14వ ఆసియాన్-భారతదేశం శిఖరాగ్ర సమావేశం మరియు 11వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి 2016 సెప్టెంబరు 7-8 తేదీలలో లావో పిడిఆర్ లోని వియెన్ తియెన్ ను సందర్శించనున్నాను. ఈ శిఖరాగ్ర సమావేశాలకు నేను హాజరు కావడం ఇప్పటికి ఇది మూడో సారి.

మన ఈశాన్య ప్రాంత ఆర్థిక అభివృద్ధి కి ఎంతో ముఖ్యమైన యాక్ట్ ఈస్ట్ పాలిసీ లో ఆసియాన్ ఒక కీలక భాగస్వామిగా ఉంది. మన భద్రత సంబంధ ప్రయోజనాలను పెంపొందింపచేసుకోవడంలోను, ఈ ప్రాంతంలో సాంప్రదాయకమైన, అసాంప్రదాయకమైన భద్రతా సంబంధ సవాళ్లకు బదులు చెప్పడంలోను కూడా ఆసియాన్ తో మన వ్యూహాత్మక భాగస్వామ్యం ముఖ్యమైందే. ఇక తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం ఆసియా పసిఫిక్ ప్రాంతం ముందున్న సవాళ్లను గురించి, అవకాశాలను గురించి చర్చించడానికి ఒక ముఖ్య చర్చాస్థలంగా ఉన్నది.

ఆగ్నేయ ఆసియా దేశాలతో మన సంబంధాలు నిజంగా చరిత్రాత్మకమైనవి.

మన సాన్నిహిత్యాన్ని గురించి, వైఖరి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మాటే – అనుసంధానం. మనం మన ప్రజలకు ప్రజలకు మధ్య ఉన్న సంబంధాలను విస్తరించుకోవడానికి, మన సంస్థాగత బంధాలను పటిష్టపరచుకోవడానికి, ఇంకా.. పరస్పరం అనుసంధానమై ఉన్న ఆధునిక ప్రపంచాన్ని మన ప్రజలందరి ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి మన మధ్య ఉన్న భౌతిక అనుసంధానాన్ని, డిజిటల్ అనుసంధానాన్ని మరింత పెంచుకోవాలని కోరుకుంటున్నాము.

నా సందర్శన కాలంలో, పరస్పర సంబంధం ఉన్న అంశాలను గురించి చర్చించడానికి శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొంటున్న దేశాల నాయకులతో సంభాషించే అవకాశం కూడా నాకు దక్కనున్నది.”