Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విజ్ఞాన్ భవ‌న్ లో రేపు సిపిఎస్ఇ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018 ఏప్రిల్ 9 వ తేదీన న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో జరుగ‌నున్న సిపిఎస్ఇ రహస్య సభ లో పాలుపంచుకోనున్నారు.

వివిధ మంత్రిత్వ శాఖ‌ల‌కు చెందిన ఉన్న‌తాధికారులు మరియు కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల సీనియ‌ర్ అధికారులు ఈ రహస్య సభ కు హాజ‌రు కానున్నారు. సిపిఎస్ఇ ల‌లో అవ‌లంబిస్తున్న ఉత్త‌మ అభ్యాసాల‌పై ఈ సభ లో వివరణలు ఉంటాయి.

మ‌ధ్యాహ్నం పూట జ‌రిగే కార్య‌క్ర‌మం లో, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, మాన‌వ వ‌న‌రుల నిర్వ‌హ‌ణ‌, కార్పొరేట్ పరిపాల‌న, ఫైనాన్షియ‌ల్ రీ-ఇంజినీరింగ్‌ తదిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేక నివేదిక‌ ల‌ను ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకు రాన్నారు. ఆ త‌రువాత ప్ర‌ధాన మంత్రి ఈ రహస్య స‌భను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.

****