Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వివిధ రాష్ట్రాల‌లో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణకు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌ల‌సి జాయింట్ వెంచర్ కంపెనీల స్థాపనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం


వివిధ రాష్ట్రాల‌లో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను చేపట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కలసి జాయింట్ వెంచర్ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్ష‌త‌ వహించారు.

ఒక్కొక్క జాయింట్ వెంచర్ (జె వి) కి చేపట్టే ప్రాజెక్టుల పరిమాణాన్ని బట్టి మొదట్లో రూ.100 కోట్ల చెల్లించిన మూలధనం (పెయిడ్- అప్ కేపిటల్) ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో రైల్వేల మంత్రిత్వ శాఖ మొదట్లో పెట్టే పెట్టుబడి రూ.50 కోట్ల్లు మాత్రమే ఉంటుంది. ప్రాజెక్టులకు మరిన్ని నిధులు/వాటా మూలధనాన్ని ఆ ప్రాజెక్టుకు అనుమతి లభించిన అనంతరం తగిన సమర్థ ప్రాధికార సంస్థ నుంచి అందజేస్తారు.

బ్యాంకులు, పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు వంటి ఇతర షేర్ హోల్డర్ల వద్ద నుంచి ఈక్విటీ హోల్డింగ్ రూపంలో ప్రాజెక్ట్- స్పెసిఫిక్ ఎస్ పి వి లను కూడా జె వి ఏర్పాటు చేయవచ్చు. జె వి ప్రక్రియ రైల్వే ప్రాజెక్టుల అమలులో రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల పరంగానే కాకుండా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మరింత ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించింది. అంతే కాదు, చట్టపరమైన అనుమతులు త్వరిత గతిన లభించడానికి, భూమి సేకరణ శీఘ్ర గతిన జరగడానికి కూడా ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది. పైపెచ్చు, ప్రయాణాలు చేసే వర్గాలకు, పలు సిమెంట్, ఉక్కు, విద్యుత్తు ప్లాంటుల వంటివాటికి తమ తమ ముడి పదార్థాలు, తుది ఉత్పత్తుల రవాణాకు అవసరమైన రైలు మార్గాలు అందుబాటులోకి వస్తాయి.