Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వీర్ సావర్కర్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని


మహోన్నత విప్లవకారుడు వీర్ సావర్కర్ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ఈ స్వాతంత్ర్య సమరయోధుడిని స్మరిస్తూ.. దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేయడానికే ఆయన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారువీర్ సావర్కర్ వ్యక్తిత్వంఆయన కృషి దేశ సేవలో ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

మహోన్నత విప్లవకారుడు వీర సావర్కర్ పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానుదేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విముక్తం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారుఆయన వ్యక్తిత్వంకృషి ప్రతి తరానికి దేశ సేవలో స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

 

***