Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ డోనాల్డ్ ట్రంప్ యుఎస్ఎ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోద


శ్రీ డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

“శ్రీ డోనాల్డ్ ట్రంప్ కు యుఎస్ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఇవే నా అభినందనలు. యుఎస్ఎ ను రానున్న సంవత్సరాలలో మరిన్ని ఘనతరమైన కార్యాల దిశగా మీరు ముందుండి నడిపించాలి అని నేను కోరుకుంటున్నాను.

భారతదేశం, యుఎస్ ల వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క శక్తి అంతా కూడా మనం పంచుకొంటున్న విలువలలోను, మన ఉమ్మడి ప్రయోజనాలలోనే ఇమిడివుంది.

భారతదేశం- యుఎస్ బంధాలను గాఢతరం చేసేందుకు మరియు మన సహకారాన్ని పూర్తి స్థాయిలో బలపరచేందుకు అధ్యక్షుల వారితో కలిసి పనిచేయడం కోసం నేను ఎదురుచూస్తూ ఉన్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.

***