Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కు, అబు ధాబి కి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీ కి మధ్య పరస్పర సహకారం మరియు సాంకేతిక సహాయం కోసం అవగాహనపూర్వక ఒప్పందం


సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ ఇ బి ఐ) కి, అబు ధాబి కి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీ (ఎఫ్ ఎస్ ఆర్ ఎ) కు మధ్య పరస్పర సహకారం మరియు సాంకేతిక సహాయం కోసం ఉద్దేశించిన ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు) పై సంతకాలు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ ఎమ్ ఒ యు ఉభయ సంతకందారుల మధ్య ఆర్థిక సంబంధాలను, సహకారాన్ని మరింతగా పెంపొందించగలదు. రెండు దేశాల సెక్యూరిటీస్ మార్కెట్ లు వికాసం చెందేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పరచడంలోనూ దోహదపడగలదు. ఈ రెండు నియంత్రణ సంస్థలూ సమాచారాన్ని పరస్పరం పంచుకొనే ప్రక్రియను పటిష్టపరచడంలో కూడా ఎమ్ ఒ యు తన వంతు భూమికను పోషిస్తుంది.