పిఎంఇండియా
మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఆఫ్ కాంపెటెన్సీ పై భారత దేశానికి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
అన్య దేశపు ప్రభుత్వం నావికులకు జారీ చేసిన మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు మరియు నావికుల విద్య మరియు శిక్షణ, సర్టిఫికెట్స్ ఆఫ్ కాంపెటెన్సీ, ఎండార్స్ మెంట్లు, శిక్షణ సంబంధిత దస్తావేజులను గుర్తించడానికి ప్రతిపాదిత ఎమ్ఒయు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ ప్రక్రియ నావికుల శిక్షణ మరియు నిర్వహణలో ఇరు దేశాలకు మధ్య సహకారం మరియు రెగ్యులేషన్ 1/10 ఆఫ్ ది కన్వెన్షన్ యొక్క నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.
ఎస్ టిసిడబ్ల్యు కన్వెన్షన్ నిర్దేశిస్తున్న మేరకు నావికులకు విద్య, శిక్షణ మరియు మదింపు చోటు చేసుకొనేటట్లుగా ఈ ఎమ్ఒయు హామీ ఇస్తుంది. అలాగే ట్రైనింగ్ అసెస్ మెంట్ లో ఎస్ టిసిడబ్ల్యు ప్రతి ఒక్క స్థాయి మరియు రకానికి సంబంధించి ఎస్ టిసిడబ్ల్యు కోడ్ కు అనుగుణంగా ఈ ప్రక్రియలు కొనసాగుతున్నదీ లేనిదీ పర్యవేక్షించడానికి కూడా ఇది తోడ్పడుతుంది.