పిఎంఇండియా
గత దశాబ్దంలో భారతదేశ రక్షణ సామర్థ్యాలలో వచ్చిన గణనీయమైన పరివర్తన గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు.
ఆత్మనిర్భరత లక్ష్యం ఆధారంగా.. ఆవిష్కరణలూ, సాంకేతిక పరిజ్ఞానమూ, స్వదేశీ తయారీ రంగం అందిస్తున్న శక్తితో భారతదేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ స్థాయిలో రూపాంతరం చెందాయని శ్రీ మోదీ అన్నారు.
స్వయం సమృద్ధిని సాధించడం ద్వారా జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని.. గత 12 ఏళ్లలో రక్షణ రంగంలో సాధించిన పురోగతి ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
గగనతల, భూతల, నావికా రంగాల్లో తన రక్షణ సామర్థ్యాలను భారత్ బలోపేతం చేసుకుందనీ, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుందనీ ప్రధానమంత్రి అన్నారు. స్వావలంబన, జాతీయ భద్రత కోసం బలమైన పునాదిని నిర్మించుకుందని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘ఆత్మనిర్భరత లక్ష్యం అందిస్తున్న మార్గదర్శకత్వంలో ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, దేశీయ తయారీ రంగం అందిస్తున్న ప్రోత్సాహంతో గత దశాబ్ద కాలంలో భారతదేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ స్థాయిలో మార్పులను సంతరించుకున్నాయి. గత 12 సంవత్సరాలుగా రక్షణ రంగంలో భారతదేశం సాధించిన పురోగతిని ఈ థ్రెడ్ క్లుప్తంగా తెలియజేస్తుంది.
‘‘గగనతల, భూతల, నావికా రంగాల్లో భారత్ తన రక్షణ సామర్థ్యాలనూ, అధునాతన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలనూ ఎలా బలోపేతం చేసుకుందో ఈ థ్రెడ్ వివరిస్తుంది. స్వావలంబన సాధించడానికి, జాతీయ భద్రతకు అవసరమైన బలమైన పునాదిని ఎలా నిర్మించుకున్నదీ తెలియజేస్తుంది’’.
***
India’s defence capabilities have witnessed significant transformation over the last decade, guided by the vision of self-reliance and powered by innovation, technology and indigenous manufacturing.
— Narendra Modi (@narendramodi) June 17, 2026
This thread gives a glimpse of the strides India has made in the defence sector…
This thread explains how India has strengthened its defence capabilities across air, land and sea, advanced indigenous technologies and built a stronger foundation for self-reliance and national security.#12YearsOfSurakshitBharat https://t.co/vbISH1cTc1
— Narendra Modi (@narendramodi) June 17, 2026