Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘హున‌ర్ హాట్’ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇక్క‌డ ఏర్పాటైన ‘హున‌ర్ హాట్’ను ఈ రోజు న సంద‌ర్శించారు.  ‘హున‌ర్ హాట్’లో పాలుపంచుకొంటున్న దేశ‌వ్యాప్త పాక‌శాస్త్ర నిపుణులు, చేతివృత్తి ప‌నివారు మ‌రియు మాస్ట‌ర్ ఆర్జిజాన్ ల యొక్క దుకాణాల ను ఆయ‌న సంద‌ర్శించారు.  ఆ త‌ర‌హా దుకాణాల ను 250కి పైగా ఇండియా గేట్ యొక్క లాన్స్ లో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  నైపుణ్యం కల పనివారి లో 50 శాతాని కి పైగా మ‌హిళ‌ లు ఉన్నారు.  విపణి లోని నిపుణులైన కార్మికుల తో ప్ర‌ధాన మంత్రి సంభాషించారు; సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ను కూడా ఆయన ఈ సందర్భం లో వీక్షించారు.

‘హున‌ర్ హాట్’ అనేది భార‌త‌దేశం లోని దేశ‌వాళీ సాంప్ర‌దాయిక వార‌స‌త్వాన్ని- దేనిలో అయితే ఎక్కువ భాగం అంత‌రించిపోవ‌డానికి చేరువ‌గా ఉన్నాయో- అటువంటి వాటి ని ప‌రిర‌క్షించ‌డం, ప్రోత్స‌హించ‌డం లతో పాటు ఉపాధి అవ‌కాశాల‌ ను క‌ల్పించ‌డం ప‌ట్ల ప్ర‌భుత్వం యొక్క నిబ‌ద్ధ‌త కు అద్దం ప‌డుతున్న‌ది.

‘కౌశ‌ల్ కో కామ్’ ఈ సంవ‌త్స‌రపు ‘హున‌ర్ హాట్’ యొక్క ఇతివృత్తం గా ఉంది.  మాస్ట‌ర్ ఆర్టిజాన్ ల కు, చేతివృత్తి కళాకారుల కు మ‌రియు నిపుణులైన వంట‌వారికి దాదాపు గా 3 ల‌క్ష‌ల మంది కి గ‌డ‌చిన మూడు సంవ‌త్స‌రాల కాలం లో ‘హున‌ర్ హాట్’ ద్వారా ఉపాధి ని క‌ల్పించ‌డ‌మైంది.  ఈ కోవ కు చెందిన ల‌బ్ధిదారుల లో ఎక్కువ మంది మ‌హిళా నిపుణ కార్మికులే ఉన్నారు.