పిఎంఇండియా
7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో రక్షా బంధన్ వేడుకలకు సంబంధించిన కొన్ని స్మరణీయ క్షణాలను ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ పండుగ ప్రజల్లో అనురాగం, సద్భావనల బంధాలను బలపరచడంతో పాటు సంతోషాన్నీ, సౌభాగ్యాన్నీ, ఉత్సాహాన్నీ కూడా ప్రసాదించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు..:
‘‘7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో రక్షా బంధన్ వేడుకలకు సంబంధించిన కొన్ని స్మరణీయ క్షణాలు..
ఈ పండుగ అనురాగం, సద్భావన బంధాలను బలపరచుగాక.
ప్రతి ఒక్కరికీ సంతోషాన్నీ, సౌభాగ్యాన్నీ అందించుగాక.
ఈ రోజు లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద జరిగిన రక్షా బంధన్ వేడుక సందర్భంగా… అభినందనలు, అమితానంద సంబరాలు … ’’
Some memorable moments from Raksha Bandhan celebrations at 7, Lok Kalyan Marg.
— Narendra Modi (@narendramodi) August 28, 2026
May this festival deepen the bonds of affection and harmony.
May it bring happiness and prosperity to everyone. pic.twitter.com/8vpTrfDeIY
High fives, smiles and more during today’s Raksha Bandhan celebrations at 7, LKM. pic.twitter.com/dMTJHxlVhH
— Narendra Modi (@narendramodi) August 28, 2026