Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గంగా ఆరతి కి హాజరైన ప్రధాన మంత్రి;  ముఖ్యమంత్రుల తో,ఉప ముఖ్యమంత్రుల తో సమావేశాన్నినిర్వహించారు; కాశీ లో కీలకమైన అభివృద్ధి పథకాల ను పరిశీలించారు

గంగా ఆరతి కి హాజరైన ప్రధాన మంత్రి;  ముఖ్యమంత్రుల తో,ఉప ముఖ్యమంత్రుల తో సమావేశాన్నినిర్వహించారు; కాశీ లో కీలకమైన అభివృద్ధి పథకాల ను పరిశీలించారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న వారాణసీ లో బాబా విశ్వనాథ్ ధామ్ ప్రారంభ కార్యక్రమం తరువాత కూడా తన కార్యక్రమాల ను కొనసాగించారు. వాటిలో భాగం గా ఆయన పూజల లో పాలుపంచుకొన్నారు; గంగ లో పవిత్ర స్నానాన్ని ఆచరించారు. ఆ తరువాత సాయంత్రం పూట గంగా ఆరతి కార్యక్రమాని కి ప్రధాన మంత్రి హాజరయ్యారు.

గంగా ఆరతి ని గురించి ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

కాశీ లో నిర్వహించే ఆరతి కార్యక్రమం మనస్సు ను ఎల్లప్పుడూ గొప్ప శక్తి తో నింపి వేస్తుంది అని పేర్కొన్నారు. ‘‘కాశీ లో జరిగే గంగా ఆరతి కార్యక్రమం సదా అంతరంగాన్ని కొత్త శక్తి తో నింపివేస్తూ ఉంటుంది. ఈ రోజు న కాశీ యొక్క పెద్ద కల నెరవేరిన మీదట దశాశ్వమేధ్ ఘాట్ లో గంగా ఆరతి కార్యక్రమం లో పాలుపంచుకొన్నాను. గంగ మాత కు ఆమె కృప కోసం నమస్కరించాను. నమామీ గంగే తవ్ పాద్ పంకజమ్’’ అని ఆయన పేర్కొన్నారు.

 

 

అనంతరం ముఖ్యమంత్రుల తో, ఉప ముఖ్యమంత్రుల తో ప్రధాన మంత్రి ఒక విస్తృత సమావేశాన్ని నిర్వహించారు

ప్రధాన మంత్రి ఒక ట్వీటల్ లో ‘‘కాశీ లో @BJP4India ముఖ్యమంత్రుల తో, ఉప ముఖ్యమంత్రుల తో ఓ విస్తృత సమావేశం కొద్ది సేపటి కిందటే ముగిసింది’ అని పేర్కొన్నారు.