Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విశాఖ రిఫైనరీలో అవశేషాల ఉన్నతీకరణ సదుపాయం ప్రారంభం..ప్రధానమంత్రి ప్రశంసలు


ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ రిఫైనరీలో హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)కు చెందిన అవశేషాల ఉన్నతీకరణ సదుపాయాన్ని (ఆర్‌యూఎఫ్) విజయవంతంగా ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఇంధన భద్రత, స్వయంసమృద్ధి సాధన దిశగా భారత్ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన వర్ణించారు.
స్వయంసమృద్ధ భారత్‌ను సాకారం చేయడంలో భాగంగా ఇంధన స్వావలంబనను ప్రోత్సహించాలన్న దేశ ప్రయత్నాలకు ఈ అత్యాధునిక సదుపాయం ఊతాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పురీ పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘
ఇంధన భద్రతను పెంచే దిశగా మనం చేస్తున్న ప్రయత్నాలకు ఈ అత్యాధునిక సదుపాయం ఊతాన్ని అందిస్తుంది.. దీనితో, ఈ రంగంలో స్వయంసమృద్ధిని మనం సాధించగలుగుతాం’’.

 

***