పిఎంఇండియా
ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఫోన్లో మాట్లాడారు.
సంభాషణ సందర్భంగా ఇరు నేతలు పశ్చిమాసియాలో తలెత్తిన పరిస్థితులపై తమ ఆందోళనను పంచుకున్నారు. సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేస్తాయని, సమన్వయంతో ప్రయత్నాలు కొనసాగిస్తాయని ప్రధానమంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘నేడు నా మిత్రుడు, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడాను. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై మా ఆందోళనలు, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం గురించి మేం చర్చించాం. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు మేం సన్నిహితంగా ఉంటూ సమన్వయంతో కృషి చేస్తాం’’
***
Spoke with my friend President Emmanuel Macron today. We discussed our shared concerns over the evolving situation in West Asia and the need for a return to dialogue and diplomacy. We will continue to engage closely and coordinate efforts towards the early restoration of peace…
— Narendra Modi (@narendramodi) March 5, 2026