ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. నిజమైన స్వేచ్ఛ.. అనగా వ్యక్తులను భయం నుంచీ, పరాధీనత నుంచీ విముక్తిని ప్రసాదించి ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవించగలిగేలా చూడటంలో ఉందని ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘యావదస్యాస్వతన్త్రత్వం తావదీశ్వరతో భయమ్
య ఏతత్సముపాసీరంస్తే ముహ్యన్తి శుచార్పితాః’’ అని పేర్కొన్నారు.
పైన ప్రస్తావించిన శ్లోకానికి భావం ఇదీ.. మనుషులు తమను స్వతంత్రులుగా భావించనంత కాలం తమ కన్న పెద్ద శక్తికి భయపడుతూ, జీవిస్తుంటారు. ఈ తథ్యాన్ని నమ్మే వారు భయ, దుఃఖాల వలలో చిక్కుకొని భ్రమలలో పడిపోతారు. నిజానికి, మనుషులకు భయం, పరాధీనతల నుంచి విముక్తం చేసి వారు ఆత్మవిశ్వాసంతోనూ, ఆత్మగౌరవంతోనూ బతుకగలిగేటట్లు చూడడంలోనే స్వాతంత్య్ర ప్రాధాన్యం వ్యక్తమవుతుంది.
***
यावदस्यास्वतन्त्रत्वं तावदीश्वरतो भयम्। य एतत्समुपासीरंस्ते मुह्यन्ति शुचार्पिताः॥ https://t.co/R3XXBeM2Cc
— Narendra Modi (@narendramodi) October 23, 2026