2026 ఆసియా పారా క్రీడల్లో పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ (ఎస్బీ9) ఈవెంట్ స్విమ్మింగ్‌లో కాంస్య పతకం సాధించిన స్వాతిక్ పాటిల్‌కు ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ అద్భుతమైన విజయం అతని క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర కృషిని ప్రతిబింబిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“స్వాతిక్ పాటిల్ స్విమ్మింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. 2026 ఆసియా పారా క్రీడల్లో పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ (ఎస్బీ9) ఈవెంట్లో కాంస్యం సాధించాడు. ఈ అద్భుతమైన విజయం అతని క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర కృషిని ప్రతిబింబిస్తుంది. అతని క్రీడా ప్రయాణంలో ఎల్లప్పుడూ విజయం సాధించాలని కోరుకుంటున్నా: పీఎం @narendramodi”
***
Excellent swimming by Swatik Patil! He has won the Bronze Medal in the Men’s 100m Breaststroke SB9 event at the Asian Para Games 2026. This fine achievement reflects his discipline, dedication and sustained efforts. My best wishes to Swatik for continued success in his sporting journey: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026