Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అద్భుతమైన ఘనత సాధించిన ప్రజ్ఞానందకు ప్రధానమంత్రి అభినందనలు


ప్రజ్ఞానంద సాధించిన అసాధారణమైన ఘనతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలిపారు. ప్రజ్ఞానంద కెరీర్‌లో ఇదొక అద్భుతమైన మైలురాయి అని, అతని నిరంతర ప్రతిభకు నిదర్శనమని ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘ఈ అద్భుత ఘనత సాధించిన ప్రజ్ఞానందకు అభినందనలు..

 

ఇది ఆయన నిరంతర ప్రతిభను చాటిచెప్పే ఒక అద్భుతమైన మైలురాయి.

 

  • ఆయన భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’