Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత బృందాన్ని అభినందించిన ప్రధానమంత్రి


లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగిన 37వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ఒక స్వర్ణ పతకం సహా మొత్తం నాలుగు పతకాలు సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భవ్య గున్వాల్, సౌమిల్ మైతీ, నిషిత్ కలని, అన్మోల్ కుమార్‌లు మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, సిస్టమాటిక్స్, ప్లాంట్ కంప్యూటేషనల్ బయాలజీ వంటి అంశాల్లో అపారమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించారన్నారు. వారి విజయం మరెందరో యువతను ఈ దిశగా ప్రోత్సహిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగిన 37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్‌లో, భారత జట్టులోని నలుగురు సభ్యులూ పతకాలు (ఒక స్వర్ణ పతకం సహా) సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం.

ఒలింపియాడ్‌లో భవ్య గున్వాల్, సౌమిల్ మైతి, నిషిత్ కలాని, అన్మోల్ కుమార్‌లు సాధించిన విజయం మనందరికీ గర్వకారణం. వారు మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, యానిమల్ ఫిజియాలజీ, యానిమల్ మార్ఫాలజీ, సిస్టమాటిక్స్ ప్లాంట్ కంప్యూటేషనల్ బయాలజీ వంటి విషయాల్లో అపారమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు.

ఈ విజయం మరెందరో యువతను ఈ దిశగా ప్రోత్సహిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను’’.