పిఎంఇండియా
2026 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల +110 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టింగులో రజత పతకాన్ని సాధించిన లవ్‌ప్రీత్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
లవ్‌ప్రీత్ సింగ్ తన అద్భుత ప్రదర్శనతో కామన్వెల్త్ క్రీడల ‘స్నాచ్’ విభాగంలో సరికొత్త రికార్డును నెలకొల్పారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఆయన అంకితభావాన్నీ, నిబద్ధతనూ శ్రీ మోదీ అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“పురుషుల +110 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన లవ్‌ప్రీత్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్నాచ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో కామన్వెల్త్ క్రీడల్లో ఒక సరికొత్త రికార్డును కూడా ఆయన నెలకొల్పారు. ఆయన అంకితభావం, పట్టుదల నిజంగా ప్రశంసనీయం. భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ.. శుభాకాంక్షలు.’’
***
Exceptional performance by Lovepreet Singh for winning a Silver in the Men's +110kg event. His outstanding effort in the snatch set a new Commonwealth Games record too. His dedication and determination are truly admirable. My best wishes to him for the endeavours ahead.#CWG2026 pic.twitter.com/fwgvJ5G3Vv
— Narendra Modi (@narendramodi) July 31, 2026