Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళల 63 కేజీల జూడోలో కాంస్య పతకం సాధించిన ఉన్నతి శర్మకు ప్రధానమంత్రి అభినందన


2026 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 63 కేజీల జూడో విభాగంలో కాంస్య పతకం సాధించిన ఉన్నతి శర్మకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ పోటీల్లో ఉన్నతి శర్మ సంకల్పం, పట్టుదల స్పష్టంగా కనిపించాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ఆమె ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

“జూడోలో భారత్ కు మరింత వైభవం! 2026 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 63 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన ఉన్నతి శర్మకు అభినందనలు. ఈ క్రీడలలో ఆమె సంకల్పం, పట్టుదల స్పష్టంగా కనిపించాయి. భవిష్యత్ లో కూడా అన్ని ప్రయత్నాలలోనూ ఆమె ఇలాగే అత్యుత్తమంగా రాణించాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.