Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా గేమ్స్‌ స్వర్ణ పతక విజేత శ్రీ దిలీప్‌… అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


ఆసియా పారా గేమ్స్‌-2026.. పురుషుల 400 మీటర్ల టీ47 పోటీలో చాలా చక్కని టైమింగుతో స్వర్ణ పతకాన్ని సాధించిన శ్రీ దిలీప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

మెరుగైన ప్రదర్శనతో శ్రీ దిలీప్ తన టైటిల్‌ను కాపాడుకోవడం ప్రశంసనీయ విజయమని శ్రీ మోదీ అన్నారు. ఆయన కనబరిచిన వేగం, దృఢ సంకల్పం, అంకితభావం నిజంగా అభినందనీయమనీ, ఆయనను చూసి భారత్ సంతోషిస్తోందనీ ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘ఆసియా పారా గేమ్స్‌-2026.. పురుషుల 400 మీటర్ల టీ47 పోటీలో చక్కని సమయపాలనతో స్వర్ణ పతకాన్ని గెలిచిన శ్రీ దిలీప్‌ను మనసారా అభినందిస్తున్నాను. మెరుగైన ప్రదర్శనతో శ్రీ దిలీప్ తన టైటిల్‌ను కాపాడుకోవడం ప్రశంసనీయ విజయం. ఆయన కనబరిచిన వేగం, దృఢ సంకల్పం, అంకితభావం నిజంగా అభినందనీయం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.

***