Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారా ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన ‘రవి కార్తీక్ బుడిగిన’కు అభినందనలు తెలియజేసిన ప్రధాని


పారా ఆసియా క్రీడలు- 2026లో పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 విభాగంలో కాంస్య పతకం సాధించిన ‘రవి కార్తీక్ బుడిగిన’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు.

రవి కార్తీక్ సాధించిన ఈ విజయం పట్ల ఎంతో గర్వంగా ఉన్నట్లు పేర్కొన్న ప్రధాని.. అతని పట్టుదల, అంకితభావాలు ప్రశంసనీయమని అన్నారు. రానున్న పోటీలలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

“పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 విభాగంలో కాంస్య పతకం సాధించిన రవి కార్తీక్ బుడిగినను చూసి ఎంతో గర్విస్తున్నాను. ఆయన పట్టుదల, అంకితభావాలు ప్రశంసనీయం. రాబోయే పోటీలలో విజయం సాధించాలని అతనికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ”