Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారా ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన నవీన్ శివకుమార్, సూర్య కాంత్ యాదవ్‌లకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


పారా ఆసియా క్రీడలు-2026 లో పురుషుల డబుల్స్ ఎస్‌ఎల్3-ఎస్‌యూ5 విభాగంలో కాంస్య పతకం గెలుచుకొని ఈ విభాగంలో భారత్‌కు మొట్టమొదటి చారిత్రాత్మక పతకాన్ని అందించిన నవీన్ శివకుమార్, సూర్య కాంత్ యాదవ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

తమ అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించడం ఇద్దరు క్రీడాకారులకు ఒక ప్రత్యేకమైన విషయమని పేర్కొన్న ప్రధాని.. వారి బృందస్ఫూర్తి, పట్టుదల, అంకితభావాలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

“పారా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు చారిత్రాత్మక కాంస్యం!

పారా ఆసియా క్రీడలు-2026లో పురుషుల డబుల్స్ ఎస్‌ఎల్3-ఎస్‌యూ5 విభాగంలో నవీన్ శివకుమార్, సూర్య కాంత్ యాదవ్ భారతదేశానికి మొట్టమొదటి పతకాన్ని అందించారు. తమ అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించడం ఇద్దరు క్రీడాకారులకు ఒక ప్రత్యేక విషయం. వారి బృందస్ఫూర్తి, పట్టుదల, అంకితభావాలు ఎంతో ప్రశంసనీయం. వారికి నా హృదయపూర్వక అభినందనలు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ”