పిఎంఇండియా
అక్షయ తృతీయ శుభ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పవిత్ర పండుగ ప్రజలను సన్మార్గంలో నడిచేందుకూ, దానధర్మాలు చేయడానికి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అక్షయ తృతీయ అందరి జీవితాల్లో సుఖసంతోషాలను, సిరిసంపదలను, ఆయురారోగ్యాలను నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘అక్షయ తృతీయ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ దానధర్మాలతోపాటు మంచి పనులు చేయడానికీ, సేవా మార్గంలో ముందుకు సాగడానికీ స్ఫూర్తినిస్తుంది. ఈ శుభ సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలను, అదృష్టాన్ని, ఆయురారోగ్యాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరికీ అక్షయ (తరగని) ఫలితాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’’
देशवासियों को अक्षय तृतीया की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व हमें सत्कर्म, दान और सेवा के मार्ग पर अग्रसर रहने की प्रेरणा देता है। यह अवसर हर किसी के जीवन में सुख, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए। सभी को अक्षय फल की प्राप्ति हो, यही कामना है।
— Narendra Modi (@narendramodi) April 19, 2026