Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

శ్రీ పవన్ కళ్యాణ్ ఎంతో ధైర్యవంతులని, ఆయన త్వరలోనే కోలుకుంటారని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం శ్రీ నరేంద్రమోదీ ప్రార్థించారు.

ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా ఇలా రాశారు:

“ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్యవంతులు… త్వరలోనే కోలుకుంటారని నేను నమ్ముతున్నాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.”