Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆట్టుకల్ పొంగాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


పవిత్రమైన ఆట్టుకల్ పొంగాల సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా శక్తిని ప్రతిబింబించే ఈ పండుగ రోజుకు ఎంతో ప్రాముఖ్యం ఉందని ప్రధానమంత్రి చెబుతూ, ఈ శుభదినాన సమాజంలో సమృద్ధి, ఉత్తమమైన ఆరోగ్యం, సద్భావన, ఐకమత్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘పవిత్రమైన ఆట్టుకల్ పొంగాల  సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పర్వదినం మన నారీ శక్తికి ఎంతో ముఖ్యమైంది. ఈ శుభ దినం అందరి జీవితాల్లో సమృద్ధిని, ఉత్తమమైన ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. సమాజంలో సద్భావనతో పాటు ఐకమత్యం వర్ధిల్లాలని నేను కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***