పిఎంఇండియా
కెనడా ప్రధాని శ్రీ మార్క్ కార్నీ భారత్‌లో పర్యటించడం ఈ రెండు దేశాల మధ్య నిజంగా సరికొత్త భాగస్వామ్యానికి బలమైన పునాదిని వేసిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
నమ్మకం, అభివృద్ది, నవకల్పన, ఉమ్మడి సమృద్ధి తో కూడిన భవిష్యత్తును ఉభయ దేశాల ప్రజలకు అందించడానికి కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కెనడా ప్రధాని పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ –
‘‘ప్రధాని శ్రీ కార్నీ, మీరు చెప్పింది పూర్తిగా సరైంది. మీ పర్యటన నిజంగానే ఒక సరికొత్త భాగస్వామ్యానికి పటిష్ఠమైన పునాదిని వేసింది.
నమ్మకం, అభివృద్ది, నవకల్పన, ఉమ్మడి సమృద్ధి తో కూడిన భవిష్యత్తును మన రెండు దేశాల ప్రజలకు అందించడానికి మీతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను.
@MarkJCarney” అని పేర్కొన్నారు.
You are absolutely right, Prime Minister Carney. Your visit has built a strong foundation for a truly renewed partnership.
— Narendra Modi (@narendramodi) March 3, 2026
I look forward to working together with you to build a future defined by trust, growth, innovation and shared prosperity for the people of our nations.… https://t.co/Jyp5s1DK9a