పిఎంఇండియా
హోళీ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంగుల పండగ అందరి జీవితాల్లో సంతోషాన్ని, సిరిసంపదలను, విజయాలను తీసుకురావాలని ఆయన కాంక్షించారు.
మొత్తం వాతావరణాన్ని హోళీ పండగ సరికొత్త శక్తితో నింపుతుందని, అదే ఈ పండగ విశిష్టత అని ప్రధానమంత్రి అన్నారు. ఈ పండగ సమయంలో కనిపించే ఆనందపు రంగులు ప్రతి ఒక్కరినీ ఉత్సాహంతో, వేడుకలతో ముంచెత్తుతాయని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి సంస్కృత సుభాషితాన్ని కూడా పంచుకున్నారు.
ఉద్బిన్నస్తబకావతంససుభగాః ప్రేఖన్మరున్నర్తితాః
పుష్పోద్గిర్ణపరాగపాంశులలసత్పత్రప్రకాణ్డ త్విషః
గంభీరక్రమపఞ్చమోన్మదపికధ్వానోచ్ఛలద్గీతయః
ప్రత్యుజ్జీవితమన్మథోత్సవ ఇవ క్రీడన్త్యమూ భూరుహః
వసంత సమీరాల మధుర నాట్యానికి పరవశించి, రంగురంగుల వర్ణాలు, పరిమళాలతో వికసించే తామర పూల వలె ఆకర్షణీయమైన ప్రేమ ఉత్సవం ఎంతో ఉత్సాహంగా వర్ధిల్లుతుంది. అది జీవితాన్ని మేల్కొల్పే మధుర రాగాలతో నిండి, నూతనోత్తేజాన్ని ఇస్తుంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“దేశ పౌరులందరికీ హోళీ శుభాకాంక్షలు. రంగులు, ఉత్సాహంతో నిండిన ఈ పండగ అందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరిసేలా చేయాలని ఆశిస్తున్నాను. ఈ రంగుల పండగతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, అభివృద్ధి, విజయాలు వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా“.
***
सभी देशवासियों को होली की अनंत शुभकामनाएं। रंग और उमंग से भरा यह त्योहार सबके लिए खुशियों की बहार लेकर आए। हर किसी के जीवन में सुख-समृद्धि और सफलता के रंगों की बौछार हो, यही कामना है।
— Narendra Modi (@narendramodi) March 4, 2026
होली का त्योहार पूरे माहौल में नई ऊर्जा भर देता है। यही इस उत्सव की बड़ी विशेषता है। हर तरफ जिस प्रकार खुशियों के रंग बिखरे नजर आते हैं, वो हर किसी को उल्लास और आनंद से सराबोर कर जाता है।
— Narendra Modi (@narendramodi) March 4, 2026
उद्भिन्नस्तबकावतंससुभगाः प्रे खन्मरुन्नर्तिताः
पुष्पोद्गीर्णपरागपांशुललसत्पत्रप्रकाण्ड… pic.twitter.com/5EmaAH5mNV