పిఎంఇండియా
ఓమన్ సుల్తాన్ గౌరవ హైతం బిన్ తారిక్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న ఇటీవలి పరిణామాలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
ఓమన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత ఉల్లంఘనకు గురవటాన్ని ప్రధానమంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి నిరంతర దౌత్యపరమైన చర్చలు అత్యవసరమని ఇరు దేశాల నాయకులు అంగీకరించారు.
భారతీయ సమాజానికి ఓమన్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ విధంగా పేర్కొన్నారు:
“ఓమన్ సుల్తాన్ గౌరవ హైతం బిన్ తారిక్‌తో మాట్లాడాను. పశ్చిమాసియాలో జరుగుతున్న ఇటీవలి పరిణామాలపై మేం అభిప్రాయాలను పంచుకున్నాం. ఓమన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత ఉల్లంఘనను తీవ్రంగా ఖండించాను. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి నిరంతర దౌత్యపరమైన చర్చలు అత్యవసరమని మేం అంగీకరించాం. భారతీయ సమాజానికి ఓమన్ అందిస్తున్న నిరంతర మద్దతును మనస్ఫూర్తిగా అభినందించాను“
***
Spoke with His Majesty Sultan Haitham bin Tarik and exchanged views on recent developments in West Asia. Condemned the violation of Oman’s sovereignty and territorial integrity. We agreed that sustained diplomatic engagement is essential for earliest restoration of regional peace…
— Narendra Modi (@narendramodi) March 3, 2026