పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. ఈ సుభాషితం వ్యక్తిగత, సామాజిక, జాతీయ కర్తవ్యాలను నెరవేర్చడంలో ఆదర్శప్రాయ, శ్రేష్ఠమైన వ్యక్తి గుణాలను మనకు తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘పరకార్యేషు యుక్తాత్మా స్వకార్యే క్షిప్రసాధనమ్
సుహృత్కార్యేషు నివృత్తీ రాజకార్యేషు విక్రమః’’ అని పేర్కొన్నారు.
ఇతరుల పనులను పూర్తి చేయడంలో అత్యంత నిష్ఠతో నిమగ్నమయ్యే వ్యక్తి, తన వ్యక్తిగత పనులను త్వరగా, సమర్థంగా నెరవేర్చే వ్యక్తి, మిత్రుల పనులను స్వార్థరహితంగా ముగించే వ్యక్తి, దేశం పట్ల కర్తవ్యాలను నిర్వహించడంలో తన పూర్తి పరాక్రమాన్ని, సాహసాన్ని కనబరిచే వ్యక్తి మాత్రమే శ్రేష్ఠమైన వ్యక్తి అని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
***
परकार्येषु युक्तात्मा स्वकार्ये क्षिप्रसाधनम्।
— Narendra Modi (@narendramodi) July 22, 2026
सुहृत्कार्येषु निर्वृत्ती राजकार्येषु विक्रमः ।। pic.twitter.com/dqKMM8ACdw