Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడల్లో కాంస్యం సాధించిన రవన్నీ వలసానైనీకి ప్రధాని అభినందనలు


ఆసియా పారా క్రీడలు–2026లో మహిళల 400 మీటర్ల టీ11 విభాగంలో కాంస్యం సాధించిన రవన్నీ వలసానైనీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. 

రవన్నీ క్రీడా ప్రదర్శన ఆమె ప్రతిభకు, ఏకాగ్రతకు నిదర్శనమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులో చేపట్టే ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ఆసియా పారా క్రీడలు–2026లో మహిళల 400 మీటర్ల టీ11 విభాగంలో కాంస్యం సాధించిన రవన్నీ వలసానైనీ భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె ప్రదర్శనకు ఆమె ప్రతిభకు, ఏకాగ్రతకు నిదర్శనం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’

 ***