Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన తేజస్ నందకుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


2026 ఆసియా పారా క్రీడల్లో పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ (ఎస్7) విభాగంలో కాంస్య పతకం సాధించిన తేజస్ నందకుమార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు.

పట్టుదల, కృషి, ప్రదర్శనను మెరుగుపరచుకోవటంలో ఆయన చూపిన నిబద్ధత అభినందనీయమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తులో జరిగే పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

“2026 ఆసియా పారా క్రీడల్లో పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ (ఎస్7) విభాగంలో తేజస్ నందకుమార్‌ కాంస్య పతకం సాధించారు. పట్టుదల, కృషి, ప్రదర్శనను మెరుగుపరచుకోవటంలో ఆయన చూపిన నిబద్ధత అభినందనీయం. తేజస్ సాధించిన విజయానికి అభినందనలు. రాబోయే పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా: పీఎం @narendramodi”

***