2026 ఆసియా పారా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన రాహుల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల హైజంప్ టీ42, టీ63 ఈవెంట్‌లో రాహుల్ అద్భుతమైన ప్రదర్శన కనబరచి కాంస్య పతకం సాధించటం పట్ల అభినందనలు తెలియజేశారు.
ఇది ఎంతో గర్వించదగిన క్షణమని, భవిష్యత్తులోనూ రాహుల్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
“2026 ఆసియా పారా క్రీడల్లో రాహుల్ అద్భుతమైన ప్రదర్శన కనబరచి దేశానికి గర్వకారణంగా నిలిచారు. పురుషుల హైజంప్ టీ42, టీ63 ఈవెంట్‌లో రాహుల్ కాంస్య పతకం సాధించారు. భవిష్యత్తులోనూ అతను నూతన శిఖరాలకు చేరుకోవాలని కాంక్షిస్తున్నా: పీఎం @narendramodi”
***
A proud moment for Rahul at the Asian Para Games 2026! He has secured the Bronze Medal in the Men's High Jump T42/T63 event with a fine jump. May he continue to reach new heights in the times to come: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026